Kaniha: ఓ మై గాడ్.. ఒట్టేసి చెబుతున్నా హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన సినిమాల్లో ఒట్టేసి చెబుతున్నా ఒకటి. 2003లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో శివాజీ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక హీరో శ్రీకాంత్ ప్రేమించే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది దివ్య అలియాస్ కనిహా సుబ్రమణ్యం.

Kaniha: ఓ మై గాడ్.. ఒట్టేసి చెబుతున్నా హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? లేటెస్ట్ ఫొటోస్ చూస్తే స్టన్ అవుతారంతే
Actress Kaniha
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2024 | 1:11 PM

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన సినిమాల్లో ఒట్టేసి చెబుతున్నా ఒకటి. 2003లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో శివాజీ మరో కీలక పాత్రలో నటించాడు. ఇక హీరో శ్రీకాంత్ ప్రేమించే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది దివ్య అలియాస్ కనిహా సుబ్రమణ్యం. తమిళనాడుకు చెందిన ఈ అందాల తార ఒట్టేసి చెబుతున్నా సినిమా మొత్తం పక్కింటమ్మాయిలా కనిపించింది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైంది. చెన్నైకు చెందిన కనిహ మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. అయితే చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండడంతో మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2001లో జరిగిన అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2002లో మణిరత్నం నిర్మించిన ఫైవ్ స్టార్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో ఆమె చేసింది రెండు సినిమాలు మాత్రమే. ఒట్టేసి చెబుతున్నా తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమెరీస్ చిత్రంలో రవితేజకు భార్యగా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలలో కనిపించలేదీ అందాల తార.

కాగా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 25కు పైగా సినిమాల్లో నటించింది కనిహా సుబ్రమణ్యం. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే 2008లో అమెరికాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్యామ్ రాధాకృష్ణన్‌ ను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఈ దంపతులకు ప్రస్తుతం ఒక బాబు ఉన్నాడు. కాక పెళ్లి తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన కనిహా ఈ మధ్యన కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. అయితే అవి కూడా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే. సినిమాల సంగతి పక్కన పెడితే.. కనిహా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంది. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇప్పటికీ ఆమె అందం అసలు తగ్గలేదంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కనిహా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Kaniha (@kaniha_official) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

గ్లామర్ లో అసలు తగ్గట్లేదుగా..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Kaniha (@kaniha_official) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.