Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఆ అందమైన ప్రదేశంలోనే వివాహం

టాలీవుడ్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి మరో మూడు రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్‌ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఆ అందమైన ప్రదేశంలోనే వివాహం
Kiran Abbavaram Marriage
Follow us
Basha Shek

|

Updated on: Aug 23, 2024 | 6:31 AM

టాలీవుడ్‌లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్ తో కలిసి మరో మూడు రోజుల్లో పెళ్లిపీటలెక్కనున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్ వేదికగా కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్‌ల వివాహ వేడుక జరగనుంది. రహస్య బంధువులందరూ అక్కడే ఉండడంతో పెళ్లి వేదికను అక్కడే ఫిక్స్ చేశారట. అయితే వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవాలనుకున్నారట. అయితే వయనాడ్ వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమంత బాగోలేదు. దీంతో తమ పెళ్లి వేదికను కర్ణాటకలోని కూర్గ్ కు మార్చారట. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కిరణ్ అబ్బవరం, రహస్యల వివాహ వేడుకకు హాజరుకానున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళుతున్నారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా కిరణ్, రహస్య ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్సే. అయితే సినిమాలపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారీ లవ్ బర్డ్స్. తొలి చిత్రంతోనే అందమైన జంటగా గుర్తింపు తెచ్చుకుంది. రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లోనూ వీరి ద్దరూ ప్రేమికులుగా మారారు. . దాదాపు ఐదేళ్ల నుంచి కిరణ్-రహస్య ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఈ ఏడాది తమ నిశ్చితార్థం ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మార్చి 13న వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇప్పుడు పెళ్లితో తమ ప్రేమ  బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారీ ప్రేమ పక్షులు.

ఇవి కూడా చదవండి

పూజల్లో కాబోయే దంపతులు..

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల రొమాంటిక్ వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Rahasya (@rahasya_gorak)

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.