AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: రోడ్డుపై సామాన్యుడిలా అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడీ హ్యాండ్సమ్ హీరో. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెల్చుకోవడంతో బన్నీ రేంజ్, క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింపుల్ గా ఉంటాడు.

Allu Arjun: రోడ్డుపై సామాన్యుడిలా అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో
Allu Arjun
Basha Shek
|

Updated on: Aug 20, 2024 | 1:46 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడీ హ్యాండ్సమ్ హీరో. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెల్చుకోవడంతో బన్నీ రేంజ్, క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయాయి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింపుల్ గా ఉంటాడు. పేరుకు పాన్ ఇండియా హీరో అయినప్పటికీ సామాన్యుడిలా రోడ్ సైడ్ డాబాలో భోం చేస్తాడు. ఇంట్లో పిల్లలతో ఆటలాడుకుంటాడు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతుంటాయి. అలా తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు బన్నీ. సాధారణంగా పాన్ ఇండియా హీరో అంటే చుట్టూ బౌన్సర్లు, కారవ్యాన్ ఇలా అన్నీ ఉంటాయి. అయితే అవేవీ పట్టని అల్లు అర్జున్ ఒక సామాన్యుడిలా రోడ్డు మీద నడిచి వెళ్లడం అందరినీ షాక్ కు గురి చేసింది. బ్లాక్ అవుట్ ఫిట్‌లో రోడ్డుపై బన్నీ సాదాసీదాగా నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. మొదటి సారి దీనిని చూసినప్పుడు చాలా మంది బన్నీని గుర్తు పట్టలేకపోయారు. అయితే ఆ తర్వాత అతను అల్లు అర్జున్ అని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సీక్వెల్ లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూమీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ యేర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ ఏడాది డిసెంబర్ 6న పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

 వీడియో ఇదిగో..

దేవిశ్రీ ప్రసాద్ తో బన్నీ…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్