Prabhas: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి చీప్ కామెంట్స్.. ఘాటుగా స్పందించిన టాలీవుడ్ నిర్మాత

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ మున్నాభాయ్ నటుడి వ్యాఖ్యలను ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ అర్ష‌ద్ కామెంట్ల‌పై ఘాటుగా స్పందించాడు. '

Prabhas: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి చీప్ కామెంట్స్.. ఘాటుగా స్పందించిన టాలీవుడ్ నిర్మాత
Arshad Warsi, Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2024 | 7:13 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ మున్నాభాయ్ నటుడి వ్యాఖ్యలను ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ అర్ష‌ద్ కామెంట్ల‌పై ఘాటుగా స్పందించాడు. ‘ఎంతో మంది అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే వ్య‌క్తిని ఇలా కించపరచడం ఏ మాత్రం స‌బ‌బు కాదు. సినిమాకు రివ్వ్యూ ఇవ్వొచ్చున‌ని, విమ‌ర్శించ‌వ‌చ్చు. అయితే.. మిస్టర్ అర్ష‌ద్ వాడిన ప‌దాలు నిర్మాణాత్మ‌క‌మైన విమ‌ర్శ‌లు కావు. కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేది. మాకు సర్య్కూట్ (మున్నా భాయ్ ఎంబీబీఎస్ లో అర్షద్ వార్సి పాత్ర పేరు) కావాలి. షార్ట్ సర్య్కూట్ వద్దు’ కౌంటరిచ్చాడు అభిషేక్ అగర్వాల్. తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖ నిర్మాత శ్రీనివాస కుమార్‌(ఎస్‌కేఎన్) అర్షద్ కామెంట్లపై స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఓ నెటిజన్‌ షేర్ చేసిన పోస్ట్ కు బేబీ నిర్మాత స్పందించారు. గుర్తింపు కోసమే ప్రభాస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా కష్టపడుతున్నారన్నారంటూ ఎస్కేఎన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

అర్షద్ వార్సీ ఏమన్నాడంటే?

కాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కల్కి సినిమాపై స్పందించిన అర్షద్ వార్సీ ప్రభాస్ పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ బాగోలేదని.. కల్కి సినిమా తనకు అస్సలు నచ్చలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను కల్కి సినిమా చూశాను. అందులో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు. తనను అలా చూసి బాదేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ను మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశాను. కానీ ఆ రేంజ్ లో సినిమాను తెరకెక్కించడంలో దర్శక నిర్మాతలు ఫెయిలయ్యారు’ అంటూ అర్షద్ వార్సీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

 అర్షద్ వార్సీ కామెంట్లకు సంబంధించిన వీడియో

సుధీర్ బాబు ట్వీట్..

It’s okay to criticize constructively but it’s never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas’s stature is too big for comments coming from small minds..

— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.