AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: రజిని వర్సెస్ సూర్య.. సూపర్ స్టార్ ‘వేట్టైయాన్’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ ర‌విచంద‌ర్ క‌ల‌యిక‌లోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావ‌టం విశేషం.

Rajinikanth: రజిని వర్సెస్ సూర్య.. సూపర్ స్టార్ 'వేట్టైయాన్' మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..
Vettaiyan
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2024 | 12:29 PM

Share

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం వేట్టైయాన్. భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. సామాజిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేసేలా సినిమాలు చేస్తూ విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లను అందుకున్న ద‌ర్శ‌కుడు టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియ మూవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్’. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ ర‌విచంద‌ర్ క‌ల‌యిక‌లోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావ‌టం విశేషం.

‘వేట్టైయాన్’ చిత్రంలో భారీతారాణం కూడా న‌టిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆస‌క్తిక‌రమైన విష‌య‌మేమంటే అంధాకానూన్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్ సినిమాల త‌ర్వాత రజినీకాంత్‌, అమితాబ్ క‌లిసి న‌టిస్తోన్న నాలుగో సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జికెఎం. త‌మిళ్ కుమ‌ర‌న్ ఆధ్వ‌ర్యంలో వేట్టైయాన్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!