AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈవారం స్ట్రీమింగ్‌కు బ్లాక్ బస్టర్ సినిమాలు.. కల్కి, రాయన్ లతో సహా..

ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్' మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్నాయి. ఉన్నంతలో ఆయ్, తంగలాన్ సినిమాలు ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. అయితే ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' అనే తెలుగు మూవీ, అలాగే 'డీమోంటీ కాలనీ 2' అనే డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈవారం స్ట్రీమింగ్‌కు బ్లాక్ బస్టర్ సినిమాలు.. కల్కి, రాయన్ లతో సహా..
OTT Movies
Basha Shek
|

Updated on: Aug 19, 2024 | 11:11 AM

Share

ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ ఆడడం లేదు. ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్నాయి. ఉన్నంతలో ఆయ్, తంగలాన్ సినిమాలు ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. అయితే ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అనే తెలుగు మూవీ, అలాగే ‘డీమోంటీ కాలనీ 2’ అనే డబ్బింగ్ సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. ప్రభాస్ ‘కల్కి’, ధనుష్ ‘రాయన్’ లాంటి క్రేజీ సినిమాలు ఈ వారంలో రిలీజ్ అవుతున్నాయి. వీటితోపాటు ‘గర్‪‌ర్‌ర్’ అనే మలయాళ డబ్బింగ్ మూవీ కూడా ఆసక్తి కలిగిస్తోంది. అలాగే పలు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆగస్టు4 వారంలో ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో..

  • టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
  • జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
  • కల్కి 2898 ఏడీ (హిందీ వెర్షన్) – ఆగస్టు 22
  • మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఆగస్టు 22
  • ప్రె‍ట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ద మూవీ పార్ట్ 1 (జపనీస్ మూవీ) – ఆగస్టు 22
  • ఇన్ కమింగ్ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 23
  • ద ఫ్రాగ్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • యాంగ్రీ యంగ్ మ‍్యాన్: ద సలీం జావేద్ స్టోరీ (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 20
  • కల్కి 2898 ఏడీ (తెలుగు సినిమా) – ఆగస్టు 22
  • ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 23
  • రాయన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 23

ఆహా

  • ఉనర్వుగల్ తొడరకథై (తమిళ సినిమా) – ఆగస్టు 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 20
  • ద సుప్రీమ్స్ ఎట్ ఎర్ల్స్ ఆల్ యూ కెన్ ఈట్ (ఇంగ్లిష్ మూవీ) – ఆగస్టు 23

మనోరమ

  • స్వకార్యం సంభవబాహులం (మలయాళం సినిమా) – ఆగస్టు 23

ఆపిల్ ప్లస్ టీవీ

  • పచింకో సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) – ఆగస్టు 23

లయన్స్ గేట్ ప్లే

  • ఇన్ ద ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 23

జియో సినిమా

  • డ్రైవ్ ఏవే డాల్స్ (ఇంగ్లిష్ సినిమా) – ఆగస్టు 23

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్