Tollywood: సాఫ్ట్‌వేర్ టు సినిమా.. త్వరలో ఓ యంగ్ హీరోతో ప్రేమ వివాహం.. ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా?

నటన, సినిమాలపై మక్కువతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి పెట్టి మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అందుకు తగ్గట్టుగానే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడీ హీరోయిన్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది.

Tollywood: సాఫ్ట్‌వేర్ టు సినిమా.. త్వరలో ఓ యంగ్ హీరోతో ప్రేమ వివాహం.. ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2024 | 10:34 AM

ఈ చిన్నారి పెళ్లి కూతురిని గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్. అయితే పెద్దగా సినిమాలేమీ చేయలేదు. నటన, సినిమాలపై మక్కువతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి పెట్టి మరీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అందుకు తగ్గట్టుగానే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడీ హీరోయిన్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. తన ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతోంది. తన మొదటి సినిమాలో హీరోగా నటించిన అబ్బాయితో ప్రేమలో పడిందీ అందాల తార. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఐదేళ్లుగా గోప్యంగానే ప్రేమించుకున్నారు. ఇప్పుడు వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా లభించడంతో పెళ్లికి సమాయత్తమవుతున్నారు. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ చిన్నారి పెళ్లి కూతురు మరెవరో కాదు ‘రాజావారు రాణిగారు’ సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్. అదేనండి మన హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకునే అమ్మాయి. ఆగస్టు 22న కిరణ్, రహస్య గోరఖ్ ల వివాహం జరగనుంది. కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి

కిరణ్ అబ్బవరంతో పెళ్లి నేపథ్యంలో రహస్య గోరఖ్ కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలాగే తన చిన్ననాటి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పై ఫొటో కూడా అందులోదే. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే. అయితే సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘రాజావారు రాణిగారు’ మూవీతో హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే అందమైన జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నిజ జీవితంలోనూ వీరు జంటగా మారనున్నాడు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్, రహస్య గోరఖ్ మార్చి 13న వీరి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రేమతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు.

ఇవి కూడా చదవండి

పూజల్లో కాబోయే దంపతులు..

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల రొమాంటిక్ వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Rahasya (@rahasya_gorak)

కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ ల ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.