AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఆ సినిమాను డైరెక్ట్ చేసిన చిరంజీవి.. ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్.. ఏ మూవీ అంటే..

చిరు కెరీర్ లోనే సూపర్ హిట్ అయిన ఇంద్ర సినిమాను ఆగస్ట్ 22న రీరిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 4k వెర్షన్ లో మరోసారి అడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి.

Megastar Chiranjeevi: ఆ సినిమాను డైరెక్ట్ చేసిన చిరంజీవి.. ఇండస్ట్రీలోనే బ్లాక్ బస్టర్ హిట్.. ఏ మూవీ అంటే..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2024 | 10:19 AM

Share

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వచ్చేస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు. అటు సోషల్ మీడియాలోనూ చిరుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ఏడాది చిరుకు పద్మ విభూషణ్ రావడం.. అలాగే మెగా ఫ్యామిలీలోకి క్లింకార రాకతో ఈసారి చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ అంబరాన్నంటేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు చిరు కెరీర్ లోనే సూపర్ హిట్ అయిన ఇంద్ర సినిమాను ఆగస్ట్ 22న రీరిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 4k వెర్షన్ లో మరోసారి అడియన్స్ ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బీ గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు సినిమా సాంగ్స్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిపోయారట. దీంతో ఇంద్ర సినిమా ప్లాష్ బ్యాక్ మొత్తం చిరంజీవి డైరెక్ట్ చేశారని.. ప్లాష్ బ్యాక్ లో హోమం సీన్, సాంగ్స్ ఆ ఎపిసోడ్స్ అన్నీ చిరునే డైరెక్ట్ చేశారని.. ఆ సన్నివేశాల్లో తాను లేకపోయినా షూటింగ్ టైంలో మాత్రం అక్కడే ఉన్నానని చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర. కేవలం ఇంద్ర సినిమాను డైరెక్ట్ చేయడం మాత్రమే కాదు.. ఎండలను కూడా లెక్కచేయకుండా చిరు షూటింగ్ లో పాల్గొన్నారని అన్నారు. మే నెలలో మండె ఎండలలో ఇంద్ర మూవీ హోమం సీన్ షూట్ చేశారని.. ఆ సమయంలో తాము కనీసం కేరవ్యా్న్ నుంచి బయటకు కాలు కూడా పెట్టలేకపోయామని.. కానీ చిరంజీవి మాత్రం ఎండలో షర్ట్ కూడా లేకుండా టవల్ వేసుకొని హోమం సీన్ చేశారని.. దాదాపు 29 రోజులపాటు ఎండలలో షూటింగ్ చేశారని అన్నారు.

ఆ ఎపిసోడ్స్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ క్రౌడ్ గా నిల్చున్న జూనియర్ ఆర్టిస్టుల దగ్గరికెళ్లి.. అమ్మా.. సినిమా షూటింగ్ లేట్ అవుతుంది.. అందుకే ఇలా మండుటెండలో షూటింగ్ చేయించాను.. నన్ను క్షమించండి అంటూ చిరు అడిగారని.. అది ఆయన క్యారెక్టర్ అంటూ చిరు గొప్ప మనసు పై ప్రశంసలు కురిపించారు రాజా రవీంద్ర. ఈ సినిమాకు ప్లాష్ బ్యాక్ సీన్స్ హైలెట్. ఇప్పుడు ఈ మూవీ చిరు బర్త్ డే సందర్భంగా మరోసారి అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా