- Telugu News Photo Gallery Cinema photos Know About Adah Sharma Education Qualification and Net Worth Details
Adah Sharma: చదివింది తక్కువే.. కానీ కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. ఆదా శర్మ ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాంకే..
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ ఆదా శర్మ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాతో కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించింది ఈ బ్యూటీ. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లా్ప్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. కానీ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.
Updated on: Aug 21, 2024 | 11:56 AM

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ ఆదా శర్మ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాతో కుర్రాళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించింది ఈ బ్యూటీ. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లా్ప్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు.

ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. కానీ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ది కేరళ స్టోరీ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తన సినిమాల విషయంలోనే కాకుండా అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది ఈ హీరోయిన్.

కొన్ని నెలల క్రితం, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటికి మారింది. ముంబైలో జన్మించిన ఆదా శర్మ ప్రాథమిక విద్యను అభ్యసించింది. నటి కావాలనే కోరికతో అదా కూడా చదువుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. చదువు పూర్తయ్యాక నటి కావాలని అదా శర్మ తల్లిదండ్రులు ఆమెకు సలహా ఇచ్చారు.

ఆదా శర్మ 12వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. ఆ తర్వాత నటనతో పాటు డ్యాన్స్ పాఠాలు కూడా తీసుకుంది. కథక్ నృత్యంలో శిక్షణ పొందింది. విక్రమ్ భట్ '1920'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాలోనే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్న ఆదా శర్మ ఇప్పటివరకు రూ.13 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకుంది. సినిమాలు, ప్రకటనలు మరియు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. షల్ మీడియాలో కూడా అదా యాక్టివ్‌గా ఉంటుంది. త్వరలో 'తుమ్కో మేరీ కసమ్'లో కనిపించనుంది.




