- Telugu News Photo Gallery Cinema photos Do You Know Actress Mouni Roy Life Struggles and Once She Is Background Dancer
Tollywood: బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే.. ఎవరంటే..
నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఆ అమ్మాయి మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేసింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. తనే హీరోయిన్ మౌనీరాయ్. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కెరీర్ మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేసిన ఈ అమ్మడు.
Updated on: Sep 01, 2024 | 2:06 PM

నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఆ అమ్మాయి మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేసింది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. తనే హీరోయిన్ మౌనీరాయ్.

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కెరీర్ మొదట్లో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్ గా పనిచేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. కానీ నాగిని సీరియల్ ద్వారానే చాలా ఫేమస్ అయ్యింది.

అభిషేక్ బచ్చన్, భూమికా చావ్లా నటించిన రన్ చిత్రం పాటలో మౌని రాయ్ మొదట డాన్సర్‌గా కనిపించింది. అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన మౌనీ రాయ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తుంది.

నాగిన్ సీరియల్ తర్వాత ఏక్తా కపూర్ షో 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ'లో కృష్ణ తులసి పాత్రను పోషించింది. అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' చిత్రంతో మౌని రాయ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కానీ నాగిన్ సీరియల్ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఇటీవల విడుదలైన జలీమా పాటలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బ్లాక్ శారీ ఫోటోస్ వైరలవుతున్నాయి.




