AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!

తెలంగాణలోని ఎస్సీ గురుకులా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధం వహించేందుకు నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ప్రత్యేక హెల్త్‌ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్త్‌ సెంటర్ నిరంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తూ అవసరమైన చిత్సను అందిస్తుంది.

Telangana: వారికి తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
Telangana Sc Gurukula Health Boost
Anand T
|

Updated on: Mar 07, 2026 | 8:35 AM

Share

తెలంగాణలోని ఎస్సీ గురుకుల సొసైటీలో చదువుతున్న విద్యార్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేందుకు గత డిసెంబర్‌లో పది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక హెల్త్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులోని నిరంతరం ఇద్దరు డాక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారు. వీరు ప్రతి రోజూ ఉదయం 8గంటలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సోసైటీలలోని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రం ద్వారా సుమారు 197 మందికి పైగా విద్యార్థులకు తీవ్రమైన వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు అవసరాన్ని భట్టి ఖరీదైన వైద్యం చేయించేందుకు సైతం ప్రభుత్వం ప్రాణాళికలు రచిస్తోంది

ఈ హెల్త్‌ కమాండ్ సెంటర్ గడిచిన 3 నెలల్లో 4,879 మంది విద్యార్థులు సాధారణ జ్వరాల ద్వారా బాధపడుతున్నారని గుర్తించింది. వీరికి స్కూల్‌లోనే వైద్యం అందించి నయం చేసింది. మరో 280 మంది విద్యార్థులను హాస్పిటల్‌కు పంపింది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సుమారు 197 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ మధ్య ఫుడ్‌ పాయిజన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి తక్షణమే వైద్యం అందించేందుకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలకు సిఫార్సు చేస్తున్నారు.

ఇప్పటికే విద్యార్థులకు చికిత్సలు

ఈ కమాండ్ హెల్త్ సెంటర్ ఇప్పటికే అనారోగ్యానికి గురైన గురుకులాల్లోని విద్యార్థులకు మెరుగైన వైద్యాన్ని అందింస్తోంది. ఖమ్మం జిల్లా మధిర బాలికల గురుకుల స్కూల్‌లో ఓ విద్యార్థిని భవనంపై నుంచి పడి వెన్నుముకకు గాయం కావడంతో సొసైటీ హెల్త్ సభ్యులు విద్యార్థిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాలో మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న మరో విద్యార్థికి సైతం ఖరీదైన ఇంజెక్షన్లతో వైద్యం కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!