AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pesarapappu Payasam: నీరసానికి బైబై.. కమ్మటి అటుకుల పెసరపప్పు పాయసం ఇలా చేసి చూడండి!

తెలుగువారి సాంప్రదాయ వంటకాలలో, ముఖ్యంగా పండుగలు మరియు శుభకార్యాల సమయంలో నైవేద్యంగా తయారు చేసే పాయసాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే సేమియా, సగ్గుబియ్యం లేదా బియ్యం పాయసం కాకుండా అటుకులు మరియు పెసరపప్పు కలంబోతతో చేసే 'అటుకుల పెసరపప్పు పాయసం' ఎంతో కమ్మగా, రుచికరంగా ఉంటుంది.

Phani CH
|

Updated on: Aug 06, 2026 | 7:31 PM

Share
పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది, అలాగే అటుకులు పాయసానికి మంచి చిక్కదనాన్ని ఇస్తాయి. తక్కువ సమయంలోనే ఎంతో తేలికగా, అమృతతుల్యమైన రుచితో ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తయారీకి ముందుగా అర కప్పు (60 గ్రామాలు) పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి, రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించుకోవాలి.

1 / 5
పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా ఉడికితే పాయసం తింటున్నప్పుడు రుచి బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కరగబెట్టి, జీడిపప్పు, ఎండుద్రాక్షలను దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో అర కప్పు లావు అటుకులు వేసి సన్నటి మంటపై లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి.

2 / 5
అటుకులు వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అర లీటరు చిక్కటి పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాలు పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించాలి.

3 / 5
పాలు పొంగిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి ఒక కప్పు బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి పాయసం కాస్త దగ్గరపడిన తర్వాత అందులో నాలుగు దంచిన యాలకులు, రెండు చిటికెల జాజికాయ పొడి వేయాలి. జాజికాయ పొడి వేయడం వల్ల పాయసానికి అద్భుతమైన సువాసన, ప్రత్యేకమైన రుచి లభిస్తాయి.

4 / 5
చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లను నేతితో సహా పాయసంలో వేసి దింపేయాలి. పాయసం దింపిన వెంటనే కాకుండా 15 నుండి 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే పాయసం చిక్కబడి ఎంతో కమ్మగా మారుతుంది. ఈ సారి పండుగకు ఈ పాయసాన్ని మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..