- Telugu News Photo Gallery Cinema photos Saradaga Kasepu Actress Madhurima, Now Nyra Banerjee Instagram Photos Viral On Social Media
Tollywood: అమ్మ బాబోయ్.! అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడేమో మెరుపు తీగలా.. ఎవరో గుర్తుపట్టారా
ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయింది. ఇక మధురిమ పేరు కాస్తా నైరా బెనర్జీగా మార్చుకుని బాలీవుడ్‌కి పయనమైంది. ఇప్పుడు హిందీ బుల్లితెరలో సందడి చేయడమే కాదు..
Updated on: Sep 01, 2024 | 8:30 AM

దర్శకుడు వంశీ, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'సరదాగా కాసేపు' సినిమా గుర్తుందా.? మణిమాల పాత్రలో మెప్పించిన ఈ వయ్యారి పేరు మధురిమ. చక్కనైన తెలుగింటి అమ్మాయిలా.. ఆకట్టుకున్న ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.

ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయింది. ఇక మధురిమ పేరు కాస్తా నైరా బెనర్జీగా మార్చుకుని బాలీవుడ్‌కి పయనమైంది. ఇప్పుడు హిందీ బుల్లితెరలో సందడి చేయడమే కాదు.. అప్పుడప్పుడూ మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ ఈ బ్యూటీ కనిపిస్తోంది.

ముంబయిలో పుట్టిన మధురిమ.. చిన్నప్పటి నుండే శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు దిద్దింది. ఈమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా. 2009లో తెలుగులో 'ఆ ఒక్కడు' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ చిన్నది.

ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ.. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. వరుసగా సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. అలా 'సరదాగా కాసేపు', 'మౌనరాగం', 'ఆరెంజ్' లాంటి చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు.

తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటించింది మధురిమ. ఆ తర్వాత హిందీ వైపునకు వెళ్లి నైరా బెనర్జీగా పేరు మార్చుకుంది. ఇప్పుడు బుల్లితెరపై 'ఫియర్ ఫ్యాక్టరీ' లాంటి రియాలిటీ షోస్‌తో పాటు పలు హిందీ సీరియళ్లలో కూడా నటించి మంచి గుర్తింపు సాధించింది.




