నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. పెట్రోలింగ్ చేస్తున్న బీట్ ఆఫీసర్ శ్రీదేవి పులిని అతి సమీపంలో చూసి షాక్కు గురై మూర్ఛపోయారు. ఈ పులి మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి వచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం పులిని డ్రోన్ కెమెరాలతో ట్రాక్ చేస్తూ, ప్రజలను అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.