AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ..

Post Office: నేటి కాలంలో కష్టపడి సంపాదించిన సొమ్ము సురక్షితంగా ఉండటంతో పాటు మంచి లాభాలను అందించే చోట పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అచ్చం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ లాగే ఉండి, అంతకంటే మెరుగైన వడ్డీని అందించే ప్రభుత్వ పథకం ఇప్పుడు పాపులర్‌గా మారింది. అదే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ భరోసాతో నడిచే ఈ పథకంలో రిస్క్ అన్నదే ఉండదు.

ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ..
Post Office Time Deposit Scheme
Krishna S
|

Updated on: Mar 07, 2026 | 11:50 AM

Share

డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే.. ఆ సంపాదించిన సొమ్మును భద్రంగా దాచుకోవడం మరొక ఎత్తు. నేటి కాలంలో ఎక్కడ చూసినా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, రిస్క్‌తో కూడిన పెట్టుబడులు మనల్ని భయపెడుతున్నాయి. మీ కష్టార్జితం రూపాయి కూడా పోకుండా, బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీకు ఉన్న అత్యంత సురక్షితమైన మార్గం.. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్.. ఇందులో మీ డబ్బుకు కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీ. ఈ పథకంలో 5 లక్షలు పెడితే, వడ్డీ రూపంలోనే 2 లక్షలకు పైగా చేతికి అందుతుంది. బ్యాంకు ఎఫ్డీ కంటే పోస్టాఫీసు స్కీమ్ చాలా బెటర్ అని నిపుణులు అంటున్నారు. మీ టాక్స్ ఆదా చేస్తూనే, మీ సంపదను రెట్టింపు చేసే ఆ పవర్‌ఫుల్ కాలిక్యులేషన్స్ ఏంటీ..? అనేది తెలుసుకుందాం..

ఏడాది నుంచి ఐదేళ్ల వరకు.. నచ్చినట్లుగా

ఈ పథకంలో పెట్టుబడిదారులు తమ వీలును బట్టి ఏడాది నుంచి 5 ఏళ్ల కాలపరిమితికి డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై మంచి వడ్డీని అందిస్తుంది.

  • 1 సంవత్సరం: 6.9శాతం వడ్డీ
  • 2 – 3 సంవత్సరాలు: 7.0శాతం వడ్డీ
  • 5 సంవత్సరాలు: ఏకంగా 7.5శాతం వడ్డీ

రూ. 5 లక్షలు పెడితే.. రూ. 2.25 లక్షల లాభం

వడ్డీ లెక్కలను గమనిస్తే ఈ పథకం ఎంత లాభదాయకమో అర్థమవుతుంది. ఉదాహరణకు.. మీరు రూ.2 లక్షలు ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. 7.5శాతం వడ్డీతో గడువు ముగిసేసరికి మీకు మీకు రూ.2,89,990 అందుతాయి. అంటే కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ.90 వేలు వస్తాయి. అదే మీరు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.7,24,974 మీ సొంతం అవుతాయి. అంటే సుమారు రూ.2.25 లక్షల అదనపు లాభం చేకూరుతుంది.

పన్ను మినహాయింపు.. మరిన్ని ప్రయోజనాలు

కేవలం వడ్డీయే కాదు, ఈ పథకం వల్ల మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. కేవలం రూ.1,000 తో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అకౌంట్‌ను ఒంటరిగా లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా నిర్వహించవచ్చు.

స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ప్రైవేట్ సంస్థల రిస్క్ భయం లేకుండా.. ప్రభుత్వ భరోసాతో మీ సంపదను పెంచుకోవడానికి పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ ఒక చక్కని మార్గం. అధిక వడ్డీ కావాలనుకునే వారు 5 ఏళ్ల కాలపరిమితిని ఎంచుకోవడం ఉత్తమం.

Follow Us