Lifestyle: బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర ఒక కొత్తరకం వంటకం, దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ అదే కావాలనిపిస్తుంది. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర సంప్రదాయ వంటకాల్లో భిన్నమైన, రుచికరమైన వంటకం. ఈ వినూత్న కాంబినేషన్ కలిపి వండితే అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఒకసారి ఈ పులుసు కూరను రుచి చూస్తే, మళ్లీ మళ్లీ అదే తినాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేకమైన వంటకాన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ వంటకానికి అర కిలో బెండకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, నాలుగు కోడిగుడ్లు, నాలుగు పచ్చిమిర్చి, ఒక కప్పు టమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడినంత ఉప్పు అవసరం.
ముందుగా బెండకాయలను శుభ్రపరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి, అది వేడయ్యాక బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించాలి. తరువాత వేయించిన బెండకాయ ముక్కలు, ఉడికించిన గుడ్లు వేసి, కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలపాటు మూత పెట్టి ఉడికించాలి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలా పొడి వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని కిందకు దించుకుంటే, వేడివేడి బెండకాయ కోడిగుడ్డు పులుసు కూర సిద్ధంగా ఉంటుంది.
ఇది చదవండి: ‘ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే మిగులుతుంది..’
