AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

ఎండలు మండిపోతున్న వేసవిలో శరీరానికి అధిక పోషకాలు అవసరం. డీహైడ్రేషన్, నీరసం తగ్గించుకోవడానికి కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అలాంటి ఆకుకూరలలో పాలకూర అత్యంత ముఖ్యమైనది. విటమిన్లు, ఐరన్, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే పాలకూరను వారానికి కనీసం ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం.

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..
Health Benefits Of Spinach In Summer
Krishna S
|

Updated on: Mar 07, 2026 | 1:55 PM

Share

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. శరీరంలోని శక్తిని కూడా హరిస్తున్నాయి. ఈ వేసవిలో వచ్చే నీరసం, అలసట, డీహైడ్రేషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. సరైన ఆహారం కూడా తీసుకోవాలి. అయితే మన పెరట్లోనే దొరికే ఒక అద్భుతమైన ఆకుకూర.. మన శరీరానికి ఒక నేచురల్ షీల్డ్‌లా పనిచేస్తుందని మీకు తెలుసా? విటమిన్లు, ఖనిజాలకు నిలయమైన పాలకూరను వారానికి ఒక్కసారైనా మీ డైట్‌లో చేర్చుకుంటే.. రక్తహీనత నుండి కంటి చూపు వరకు, ఎముకల బలం నుండి గుండె ఆరోగ్యం వరకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా పాలకూరను వండేటప్పుడు మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల అందులోని పోషకాలు మొత్తం నశించిపోతాయి. వేసవి తాపాన్ని తట్టుకునే శక్తినిచ్చే ఈ సూపర్ ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రక్తహీనతకు చెక్ :

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. మీరు రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే, పాలకూర తినడం ఒక గొప్ప పరిష్కారం.

కంటి చూపు మెరుగు

పాలకూరలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి కళ్ళను రక్షించి, వయస్సుతో పాటు వచ్చే కంటి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.

రోగనిరోధక శక్తి పెంపు

విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పాలకూర, శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. వేసవిలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

ఎముకల బలం

పాలకూరలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో, శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం – రక్తపోటు నియంత్రణ

పాలకూరలోని పొటాషియం, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పాలకూరను ఎలా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం?

పాలకూర తినేటప్పుడు పైన కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే, అందులోని విటమిన్ సి.. పాలకూరలోని ఐరన్ శరీరం వేగంగా గ్రహించడానికి సహాయపడుతుంది. పాలకూరను ఎక్కువసేపు ఉడికించడం వల్ల దానిలోని పోషకాలు నశించిపోతాయి. తేలికగా వేయించడం లేదా ఆవిరి చేయడం మంచిది.

Follow Us