గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తాగే అలవాటు మీకూ ఉందా? 

29 April 2026

TV9 Telugu

TV9 Telugu

తేనె ఆరోగ్యానికి మంచిదనే భావన చాలా మందిలో ఉంది. సహజమైన మధుర పదార్థంగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు

TV9 Telugu

అయితే తేనెను ఎలా ఉపయోగిస్తామన్నదే దాని ప్రయోజనాలను నిర్ణయిస్తుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తేనె సాధారణంగా సురక్షితమైన ఆహార పదార్థమే

TV9 Telugu

శతాబ్దాలుగా దీన్ని ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. కానీ దీనిని వేడి చేసే విధానం, నిల్వ చేసే విధానం వంటి అంశాలు దాని పోషక విలువల‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

తేనెను మోస్తరు ఉష్ణోగ్రత వద్ద వాడడం పెద్ద సమస్య కాదు. సాధారణ వంటకాలలో లేదా గోరువెచ్చని పదార్థాల్లో కలిపితే హానికరం కాదు. కానీ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే సమస్యలు మొదలవుతాయి

TV9 Telugu

అధిక వేడి వల్ల తేనెలో ఉండే సహజ ఎంజైమ్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్రమంగా నశించిపోతాయి. సుమారు 40 డిగ్రీల సెల్సియస్‌కి పైగా ఉష్ణోగ్రతలకు తేనెను గురి చేస్తే థర్మల్ డీగ్రడేషన్ అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది

TV9 Telugu

అంటే తేనె నిర్మాణం మారి, దాని గుణాత్మక విలువ తగ్గిపోతుంది. ఫలితంగా రుచి, వాసన, రంగు కూడా మారే అవకాశం ఉంటుంది

TV9 Telugu

అందువల్ల తేనెను సరిగ్గా ఉపయోగించడం అల‌వాటు చేసుకోవాలి. తేనెను స‌రిగ్గా వాడ‌డానికి కొన్ని సులభమైన సూచనలను కూడా నిపుణులు తెలియ‌జేస్తున్నారు

TV9 Telugu

మరిగిన నీటిలో కాకుండా గోరువెచ్చని నీటిలో తేనె కలపడం మంచిది. వంట పూర్తయ్యాక ఆహారంపై తేనెను జోడించడం ఉత్తమం. అలాగే తేనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం నివారించాలి. తేనె హానికరం కాదు. కానీ దాన్ని ఎలా వాడుతామనే దానిపై ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి