AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!

Ryan Rickelton: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఒక అరుదైన రికార్డుకు వేదికైంది. వాంఖడే స్టేడియం సాక్షిగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం రెండేళ్ల కాలంలోనే ముంబై ఫ్రాంచైజీ తరపున అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు.

రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!
Mi Vs Srh Ryan Rickelton Rohit
Venkata Chari
|

Updated on: Apr 29, 2026 | 9:56 PM

Share

Ryan Rickelton Breaks Rohit Sharma Record: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రికెల్టన్ తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాడు. కేవలం 44 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని, ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తిలక్ వర్మ, సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డులను ఆయన అధిగమించాడు.

రోహిత్ శర్మ రికార్డు బద్దలు..

ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ అనే పేరు మారుమోగుతుంది. కానీ, ర్యాన్ రికెల్టన్ కేవలం రెండు సీజన్లలోనే ఆ లెగసీని సవాల్ చేశాడు. ముంబై ఫ్రాంచైజీకి చెందిన వివిధ లీగ్‌లలో (ఐపీఎల్, ఎస్ఏ20) కలిపి రికెల్టన్ ఇప్పుడు 3 సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజాలు రెండేసి సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. భారత ఆటగాళ్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండటం వల్ల రికెల్టన్ ఇతర లీగ్‌లలో కూడా రాణించి ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ముంబై ఇండియన్స్ వేగవంతమైన శతకాలు..

రియాన్ రికెల్టన్: 44 బంతులు (సన్ రైజర్స్ హైదరాబాద్‌పై, 2026)

సనత్ జయసూర్య: 45 బంతులు (చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2008)

తిలక్ వర్మ: 45 బంతులు (గుజరాత్ టైటాన్స్‌పై, 2026)

కామెరాన్ గ్రీన్: 47 బంతులు (సన్ రైజర్స్ హైదరాబాద్‌పై, 2023)

అవకాశాన్ని అందిపుచ్చుకున్న వైనం..

నిజానికి ఈ సీజన్ రికెల్టన్‌కు ఎత్తుపల్లాలతో సాగింది. జట్టులో క్వింటన్ డి కాక్ ఉండటంతో రికెల్టన్‌కు అవకాశాలు తక్కువగా వచ్చాయి. అయితే, డి కాక్ గాయపడటంతో వచ్చిన అవకాశాన్ని రికెల్టన్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ముంబై యాజమాన్యానికి ఇప్పుడు తుది జట్టు ఎంపికలో తీపి తలనొప్పి మొదలైంది. రికెల్టన్ ఫామ్ చూస్తుంటే ఆయనను పక్కన పెట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది.

ముంబై ఇండియన్స్ టాప్ స్కోరర్లు (ఐపీఎల్)..

ముంబై తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వారిలో రికెల్టన్ (109*) ఇప్పుడు మూడో స్థానంలో నిలిచారు. జయసూర్య (114*), డి కాక్ (112*) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ రికార్డులతో రికెల్టన్ తన ధరను (1 కోటి రూపాయలు) వంద రెట్లు సమర్థించుకున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us