AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: ‘ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే మిగులుతుంది..’

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ అయినప్పటికీ,అతనికి ఒక చెడ్డ రోజు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. బుమ్రాను టార్గెట్ చేయడమే తమ ప్రణాళిక అని ఫిలిప్స్ ధీమా వ్యక్తం చేశాడు.

IND Vs NZ: 'ఫైనల్‌లో టీమిండియాను ఓడించే దమ్మున్నోళ్లం.. వాడికి కన్నీరే మిగులుతుంది..'
Ind Vs Nz
Ravi Kiran
|

Updated on: Mar 07, 2026 | 11:36 AM

Share

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరుకు ముందు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ టీమిండియాను ఓడించే ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా భారత పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని ఫిలిప్స్ వెల్లడించాడు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడంతో, భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టు బుమ్రాపై ప్రత్యేక దృష్టి సారించింది.

గ్లెన్ ఫిలిప్స్ మాట్లాడుతూ, జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రశంసించాడు. అతని అమ్ములపొదలో అన్ని అస్త్రాలు వైవిధ్యమైనవని, ముఖ్యంగా డెత్ ఓవర్లలో వేసే పర్ఫెక్ట్ యార్కర్లు ఏ బ్యాటరుకైనా సవాల్ విసురుతాయని పేర్కొన్నాడు. బుమ్రా గొప్ప బౌలర్ అయినప్పటికీ, అతనూ మనిషే అని ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఫిలిప్స్ వ్యాఖ్యానించాడు. అందరిలాగే అతనికి కూడా ఓ చెడ్డ రోజు ఉండవచ్చని, అది ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ రోజే కావాలని తాము బలంగా కోరుకుంటున్నట్లు ఫిలిప్స్ తెలిపాడు.

టీమిండియాను ఓడించేందుకు తమ దగ్గర ప్రణాళికలు ఉన్నాయని.. బుమ్రాను టార్గెట్ చేయడమే తమ పని అని ఫిలిప్స్ ధీమా వ్యక్తం చేశాడు. అందుకు తాము సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. బుమ్రా ఎంత డేంజరస్ బౌలర్ అయినా, అతను వేసే నాలుగు ఓవర్లను కేవలం డిఫెన్స్ ఆడుతూ వదిలేయలేమని ఫిలిప్స్ స్పష్టం చేశాడు. అతని చెత్త బంతులను కచ్చితంగా బౌండరీలకు తరలిస్తామని, అందుకు తమ బ్యాటర్లు ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా, బుమ్రా బౌలింగ్ తీరును బట్టి తమ ప్రణాళికలను అప్పటికప్పుడు మార్చుకుంటామని కూడా ఫిలిప్స్ వెల్లడించాడు. అన్ని విభాగాల్లో టీమిండియాతో తాము సమంగా ఉన్నామని, రెండు జట్ల మధ్య బుమ్రా ఒక్కడే తేడా అని గ్లెన్ ఫిలిప్స్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ జట్టు బుమ్రాను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నట్లు అతని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

ఇది చదవండి: సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు వెళ్తే.. టీమిండియాకు శనిలా అతిపెద్ద రెండు గండాలు

Follow Us
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు
150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర