- Telugu News Photo Gallery Cinema photos Hero Prabhas Spirit Movie may get delayed, fans feel it's too late Telugu Heroes Photos
Prabhas – Spirit: స్పిరిట్ మూవీ సంగతేంటి.? డార్లింగ్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.!
కల్కి 2898 ఏడీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్, నెక్ట్స్ సినిమాల లైనప్‌ను మార్చేశారు. ఆల్రెడీ ప్రకటించిన సినిమాలను కాస్త వెనక్కి నెట్టి కొత్త ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువచ్చారు. దీంతో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావటం కాస్త ఆలస్యం కానుంది. కల్కి 2898 ఏడీ సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమాను ఎనౌన్స్ చేశారు.
Updated on: Sep 01, 2024 | 2:59 PM

అలాగే ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నారు. వీళ్ళందరి ఆశ ఒక్కటే.. ప్రభాస్‌తో హిట్ కొడితే 1000 కోట్లతో పాటు బోనస్‌గా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనే ముద్ర పడుతుంది.

దీంతో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఒకటి ఆడియన్స్ ముందుకు రావటం కాస్త ఆలస్యం కానుంది. కల్కి 2898 ఏడీ సెట్స్ మీద ఉండగానే రాజాసాబ్ సినిమాను పట్టాలెక్కించారు ప్రభాస్.

మిగతా సినిమాలేవి కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేవు. అందుకే డార్లింగ్ తన రికార్డ్ తానే బ్రేక్ చేసే టైమ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ది రాజా సాబ్, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, వీటిలో ఏదో ఒక మూవీతో 1800 కోట్ల మార్క్‌ను బీట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు.

యానిమల్ రిలీజ్ తరువాత నెక్ట్స్ స్పిరిట్ మూవీనే పట్టాలెక్కిస్తానని చెప్పిన సందీప్, స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దీంతో రాజాసాబ్ తరువాత ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిటే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.

కానీ సడన్‌గా ఈ లైనప్ మారిపోయింది. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావటంతో ఈ గ్యాప్‌లో మరో మూవీని పట్టాలెక్కించారు డార్లింగ్.

హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ రొమాంటిక్ వార్ డ్రామాను లైన్‌లో పెట్టారు. రీసెంట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. దీంతో పాటే హను రాఘవపూడి సినిమా సెట్స్‌పై ఉంది. 2025 సమ్మర్ నాటికి ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు అదే సమ్మర్ కానుకగా ఎప్రిల్ 10 రాజా సాబ్ విడుదల కానుంది.




