Tollywood: ఒకప్పుడు సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో.. ఆ వ్యక్తిని గుర్తుపట్టారా..?

సినీరంగంలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడు.. తమిళ్, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ?.. గుర్తుపట్టారా..? పైన ఫోటోలో ధనుష్ గ్యాంగ్‏లో వెనక నిల్చున్న అబ్బాయి మరెవరో కాదండి..

Tollywood: ఒకప్పుడు సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో.. ఆ వ్యక్తిని గుర్తుపట్టారా..?
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2024 | 6:43 PM

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ అబ్బాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆ అబ్బాయి.. ఇప్పుడు హీరోగా ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వినిపించిన అతని పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతుంది. సినీరంగంలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆ కుర్రాడు.. తమిళ్, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ?.. గుర్తుపట్టారా..? పైన ఫోటోలో ధనుష్ గ్యాంగ్‏లో వెనక నిల్చున్న అబ్బాయి మరెవరో కాదండి.. కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్.. అలియాస్ విజయ్ సేతుపతి. ఒకప్పుడు కనీసం ప్రేక్షకులకు అతడి పేరు కూడా తెలియదు.. కానీ ఇప్పుడు మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో. సేతుపతిని ప్రజలు ప్రేమగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ధనుష్, విజయ్ కలిసి ఉన్న త్రోబ్యాక్ ఫోటోను సేతుపతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

అలాగే గతంలో నేషనల్ ధనుష్‏తోపాటు విజయ్ నేషనల్ అవార్డ్ అందుకున్న ఫోటోను జతచేస్తూ.. ఒకప్పుడు హీరో వెనక.. ఇప్పుడు ధనుష్‏తోపాటు ఓకే వేదికపై నేషనల్ అవార్డ్ అందుకున్న సేతుపతి అంటూ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీరంగంలోకి రాకముందు దుబాయ్‏లో పనిచేసేవారు విజయ్. కానీ నటనపై ఆసక్తితో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో సినిమాల్లో హీరో స్నేహితుడిగా, సహాయ పాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

కానీ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‍గా ఎదిగారు. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొన్నాడు. కానీ తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 2012లో పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. కానీ ఆ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో సేతుపతికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. కానీ తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ పాత్రతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా.. పూర్తిగా నెగిటివ్ రోల్ పోషించాడు విజయ్. అప్పటివరకు స్టార్ హీరోగా వరుస హిట్స్ అందుకుంటున్న విజయ్.. తెలుగులో మాత్రం విలన్ పాత్రలో అదరగొట్టేశారు. ఆ తర్వాత జవాన్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే మహారాజా సినిమాతో హిట్ అందుకున్న విజయ్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?