- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress in This Photo She Is Tollywood Heroine Sneha, Childhood Photo
Tollywood: ఆమె అందానికి ఎవరైనా అభిమానులు కావాల్సిందే.. ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?
సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్. ఆమె మరెవరో కాదు స్నేహ. మాతృభాష తెలుగు మాట్లాడే స్నేహ దుబాయ్‌లో చదువుకుని పెరిగింది.
Updated on: Sep 08, 2024 | 4:51 PM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్. ఆమె మరెవరో కాదు స్నేహ.

మాతృభాష తెలుగు మాట్లాడే స్నేహ దుబాయ్‌లో చదువుకుని పెరిగింది. కొన్నేళ్ల క్రితమే ఆమె కుటుంబం తమిళనాడుకు వెళ్లి స్థిరపడింది. మలయాళ చిత్రం 'ఇంగనే ఒరు నీలాభక్షి'తో ఆమె నటిగా రంగప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

2000వ దశకం ప్రారంభంలో, సిమ్రాన్, రంభ, జ్యోతిక వంటి నటీమణులు అగ్ర కథానాయికలుగా దూసుకుపోతున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ అనే నాలుగు భాషలలో సినిమాలు చేసింది.

2001లో మాధవన్ సరసన విడుదలైన 'ఎన్నవాలే' స్నేహ తమిళంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే పక్కింటి అమ్మాయిగా కనిపించి అలరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

తెలుగులో గోపిచంద్ సరసన తొలివలపు సినిమాలో నటించింది. ఆ తర్వాత ప్రియమైన నీకు మూవీతో సూపర్ హిట్ అందుకుంది. నాగార్జున, శ్రీకాంత్, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. తమిళ నటుడు ప్రసన్నను 2012లో వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు.





























