Tamannaah : అలాంటి వ్యక్తితో బంధమంటే ప్రమాదమే.. నా మనసు ముక్కలయ్యింది.. హీరోయిన్ తమన్నా..

ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం గురించి ఫిల్మ్ సర్కిల్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పిన ఈ జంట.. ప్రస్తుతం కెరీర్ విషయాల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన జీవితంలో రిలేషన్ షిప్ లో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.

Tamannaah : అలాంటి వ్యక్తితో బంధమంటే ప్రమాదమే.. నా మనసు ముక్కలయ్యింది.. హీరోయిన్ తమన్నా..
Tamannah
Follow us

|

Updated on: Sep 08, 2024 | 8:40 PM

మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగిస్తుంది. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతుంది. ఇటు వెండితెరపై.. అటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సత్తా చాటుతుంది. అయితే కొన్ని నెలలుగా తమన్నా పర్సనల్ విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం గురించి ఫిల్మ్ సర్కిల్లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా చెప్పిన ఈ జంట.. ప్రస్తుతం కెరీర్ విషయాల్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తన జీవితంలో రిలేషన్ షిప్ లో తాను కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.

టీనేజ్ లో ఉన్నప్పుడే తొలిసారి ప్రేమలో పడ్డానని.. కానీ కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదని.. తన లైఫ్ లో రెండుసార్లు బ్రేకప్ జరిగిందని తెలిపింది. “ఇప్పటివరకు నా హృదయం రెండుసార్లు ముక్కలైంది. అప్పుడు ఎంతో బాధపడ్డాను. టీనేజ్ లో ఉన్నప్పుడే తొలి హార్ట్ బ్రేక్ జరిగింది. ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని.. కొత్త విషయాలు అన్వేషించాలనేది నా భావన. ఆ కారణంగానే మొదటి బంధం నిలవలేదు. కొన్నాళ్లకు మరో వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నాను.. కానీ అతడు నాకు కరెక్ట్ కాదనిపించింది. ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి వ్యక్తితో బంధమంటే ప్రమాదమని అర్థమైంది. అలా రెండో సారి బ్రేకప్ జరిగింది” అంటూ చెప్పుకొచ్చింది తమన్నా.

ఇటీవలే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరిగరాసిన స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ప్రస్తుతం ఓదెల 2 చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. అలాగే హిందీలో పలు ప్రాజెక్ట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?