Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాలో అలాంటి సీన్.. 20 ఏళ్ల హీరోయిన్ పట్ల అలా ప్రవర్తించిన 42 ఏళ్ల హీరో.. చివరకు..

కొన్నిసార్లు తమ తోటి నటీనటుల కారణంగా ఇబ్బందికి గురయ్యామని.. అందరి ముందు పలువురు నటులు అసౌకర్యాన్ని కలిగిస్తారంటూ పలువురు నటీమణులు వాపోయారు. కానీ ఓ హీరోయిన్‍కు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. లిప్ లాక్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఓ 42 ఏళ్ల హీరో 20 ఏళ్ల వయసున్న హీరోయిన్ పెదవిని కొరికేశాడట.

Tollywood: సినిమాలో అలాంటి సీన్.. 20 ఏళ్ల హీరోయిన్ పట్ల అలా ప్రవర్తించిన 42 ఏళ్ల హీరో.. చివరకు..
Actress
Follow us
Rajitha Chanti

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 06, 2024 | 5:55 PM

సినీరంగంలో నటీమణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా చిత్రాల్లో రొమాన్స్ సీన్స్ సమయంలో కఠినమైన పరిస్థితులు ఉండేవని ఇదివరకే చాలా మంది హీరోయిన్స్ చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు తమ తోటి నటీనటుల కారణంగా ఇబ్బందికి గురయ్యామని.. అందరి ముందు పలువురు నటులు అసౌకర్యాన్ని కలిగిస్తారంటూ పలువురు నటీమణులు వాపోయారు. కానీ ఓ హీరోయిన్‍కు మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యింది. లిప్ లాక్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ఓ 42 ఏళ్ల హీరో 20 ఏళ్ల వయసున్న హీరోయిన్ పెదవిని కొరికేశాడట. వారిద్దరు మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నా, హీరోయిన్ మాధురీ దీక్షిత్. 36 ఏళ్ల కిందట హిందీలో మంచి విజయం సాధించిన సినిమా దయావన్. ఇందులో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ హీరోహీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో ఆజ్ ఫిర్ తుమ్ సే అనే పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందట.

ఈ సినిమా సమయానికి వినోద్ ఖన్నా వయసు 42 ఏళ్లు. ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఈ సినిమా ఆజ్ ఫిర్ తుమ్ సే అనే పాటలో లిప్ లాక్ సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు హీరో వినోద్ ఖన్నా నియంత్రణ కోల్పోయి హీరోయిన్ పెదవిని గట్టిగా కొరికేశాడట. సీన్ ముగిసిందని వారిస్తున్నప్పటికీ అతడు వినకుండా కంటిన్యూ చేయడంతో డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ రంగంలోకి వినోద్ ఖన్నాను వారించాడట. ఊహించని పరిణామంతో షాక్ తిన్నదట మాధురీ దీక్షిత్. కానీ అప్పటికే ఆమె పెదవి కట్ అయి రక్తం కారడంతో ఏడుస్తూ ఉండిపోయిందట. ఆ తర్వాత ఆమెకు వినోద్ ఖన్నా, డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ క్షమాపణ చెప్పడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. ఈ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి మరో సినిమా చేయలేదు.

దయావన్ చిత్రాన్ని తెలుగు, తమిళంలో నాయకుడు పేరుతో రీమేక్ చేశారు. 1987 విడుదలైన ఈమూవీలో కమల్ హాసన్ హీరోగా నటించగా.. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. దయావన్ సినిమా తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ మాధురి దీక్షిత్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమెకు హిందీతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

Dayawan Movie

Dayawan Movie

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.