AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్.. దిమ్మ తిరిగే ట్విస్టులు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఇప్పుడు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. అదే టొవినో థామస్ నటించిన నీలవెలిచం. తెలుగులో భార్గవి నిలయం పేరుతో ఓటీటీలోకి రానుంది. గతేడాది ఏప్రిల్ 20న ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆషిక్ అబు తెరకెక్కించిన ఈ సూపర్ హారర్ థ్రిల్లర్ సినిమాలో టొవినో థామస్ తో పాటు..

OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళం హారర్ థ్రిల్లర్.. దిమ్మ తిరిగే ట్విస్టులు.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Bhargavi Nilayam Movie
Basha Shek
|

Updated on: Sep 04, 2024 | 6:35 PM

Share

ప్రస్తుతం మలయాళ సినిమాల క్రేజ్ నడుస్తోంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇక ఓటీటీలో అయితే మలయాళం సినిమాలదే పూర్తి హవా. అందుకు తగ్గట్టుగానే మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగుతో పాటు వివిధ భాషల్లోకి అనువదించి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. అదే టొవినో థామస్ నటించిన నీలవెలిచం. తెలుగులో భార్గవి నిలయం పేరుతో ఓటీటీలోకి రానుంది. గతేడాది ఏప్రిల్ 20న ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆషిక్ అబు తెరకెక్కించిన ఈ సూపర్ హారర్ థ్రిల్లర్ సినిమాలో టొవినో థామస్ తో పాటు రిమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. రాజేశ్ మాధవన్, చెంబన్ వినోద్ జోస్, అభిరామ్ రాధాకృష్ణన్, ప్రమోద్ వెలియనాడ్ తదితరులు కీ రోల్స్ లో మెరిశారు. మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా ఇప్పుడు భార్గవి నిలయం పేరుతో తెలుగులోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

సినిమా కథేంటంటే..

గురువారం ( సెప్టెంబర్ 05) నుంచే ఈ సినిమా ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధకారికంగా ప్రకటించింది ఆహా. ‘భార్గవి నిలయంతో ఎంటర్‌టైన్‍ చేసేందుకు మన టొవినో థామస్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 5న ఆహాలో ప్రీమియర్ కానుంది’ అని ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే భార్గవి నిలయం సినిమా భయపెట్టేందుకు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందన్నమాట. ఓ పాడుపడిన భవనంలో ఆత్మ తిరగడం, ఆ ఫ్లాష్‍బ్యాక్, లవ్ స్టోరీ చుట్టూ భార్గవి నిలయం సినిమా తిరుగుతుంది. ఆడియెన్స్ ను ఆకట్టుకునే హారర్ ఎలిమెంట్లు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. మరి మీరు కూడా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారా? అయితే ఈ భార్గవి నిలయం కూడా చూసేయండి. మరికొన్ని గంటల్లో ఆహాలోకి అందుబాటులోకి వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!