Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: మళ్లీ ముంబయికి వచ్చేసిన హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా.. కారణమిదే!

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత తన స్వదేశానికి పయనమైపోయింది నటి నటాషా స్టాంకోవిచ్. తన కొడుకును అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది . అక్కడే కుమారుడి 4వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Hardik Pandya: మళ్లీ ముంబయికి వచ్చేసిన హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా.. కారణమిదే!
Hardik Pandya, Natasa Stankovic
Basha Shek
|

Updated on: Sep 03, 2024 | 6:35 PM

Share

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకుల తర్వాత తన స్వదేశానికి బయలుదేరింది  నటి నటాషా స్టాంకోవిచ్. తన కొడుకును అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది . అక్కడే కుమారుడి 4వ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరోవైపు క్రికెట్ లైఫ్ లో బిజీ అయిపోయిన హార్దిక్ పాండ్యా తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. అయితే నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్య మళ్లీ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. మొదట బాలీవుడ్ నటి అనన్యా పాండేతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆతర్వాత బ్రిటీష్ ప్రముఖ సింగర్, టెలివిజన్ పర్సనాలిటీ జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. ఇద్దరూ కలిసి గ్రీస్‌కి హాలిడే ట్రిప్ కి వెళ్లినట్లు కూడా సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా మళ్లీ ముంబయికి తిరిగిరావడం ఆసక్తికరంగా మారింది. తన ముంబై విజిట్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసుకుంది నటాషా. అయితే ఇందులో ఎక్కడా కుమారుడు ఆగస్త్య కనిపించలేదు. మరి ఆమె ఎందుకు ముంబై వచ్చిందో ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు.

హార్దిక్ పాండ్య, నటాషాలది ప్రేమ వివాహం. 2020 మే 31న కరోనా సమయంలో వీరి వివాహం జరిగింది వారికి అదే ఏడాదిలో అగస్త్య పుట్టాడు. ఆ తర్వాత పిల్లాడి సమక్షంలోనే మళ్లీ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు హార్దిక్- నటాషా. అయితే ఇది జరిగిన కొన్నేళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. హార్దిక్ తో కలిసున్న ఫొటోలను నటాషా డిలీట్ చేయడం, ఆ తర్వాత ఇద్దరూ ఎడ మొహం, పెడ మొహంగా ఉండడంతో వీరి విడాకుల రూమర్లకు బలం చేకూరింది. వీటిని నిజం చేస్తూ జూలైలో ఇద్దరూ అధికారికంగా విడిపోయారు. ‘తాము విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నాం’ అంటూ ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే కో-పేరెంట్స్‌గా అగస్త్యకి తాము చేయాల్సిందంతా చేస్తామని వెల్లడించారు. హార్దిక్ తో విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే అగస్త్యను తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా. అయితే మళ్లీ నెలన్నరలోపే ఆమె ముంబయికి తిరిగి రావడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

కుమారుడు అగస్త్యతో నటాషా స్టాంకోవిచ్..

View this post on Instagram

A post shared by @natasastankovic__

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..