Bigg Boss Telugu 8:‍ బిగ్‌బాస్‌లోకి బర్రెలక్క! ఎంట్రీని అలా సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేశారా? అసలు ఊహించలేదుగా!

. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈమె పేరు బాగా వినిపించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బర్రెలక్కకు బహిరంగంగా తమ మద్దతను ప్రకటించారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈమె పేరు మార్మోగిపోయింది. దీంతో గతేడాది నుంచే బర్రెలక్క పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో వినిపించింది. అయితే ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లాంచింగ్ లో ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు

Bigg Boss Telugu 8:‍ బిగ్‌బాస్‌లోకి బర్రెలక్క! ఎంట్రీని అలా సర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేశారా? అసలు ఊహించలేదుగా!
Barrelakka alias Karne Sirisha
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2024 | 8:20 PM

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 01) సాయంత్రం బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ జరిగింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈ సారి హౌస్‌లోకి అడుగు పెట్టారు. సింగిల్ గా కాకుండా ఇద్దరేసి జంటలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు హోస్ట్ నాగార్జున. అయితే దీనికి ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో బర్రెలక్క అలియాశ్ కర్నె శిరీష పేరు కూడా బాగా వినిపించింది. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈమె పేరు బాగా వినిపించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బర్రెలక్కకు బహిరంగంగా తమ మద్దతను ప్రకటించారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈమె పేరు మార్మోగిపోయింది. దీంతో గతేడాది నుంచే బర్రెలక్క పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాబితాలో వినిపించింది. అయితే ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లాంచింగ్ లో ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. దీంతో చాలామంది నిరాశకు గురయ్యారు. అయితే లేటుగా అయినా లేటెస్ట్ గా బర్రెలక్క బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా గత సీజన్ లాగే ఈసారి కూడా మొత్తం 20 మందిని కంటెస్టెంట్స గా తీసుకోవాలని బిగ్ బాస్ టీమ్ భావించిందట.

అందులో నా పేరు ఉంది.. కానీ..

ఇందులో భాగంగా మొదట విడతలో 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారట. మిగతా వారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకుంటారని తెలుస్తోంది. ఈ ఆరుగురిలో బర్రెలక్క పేరు తప్పకుండా ఉండనుందని సమచారం. కాగా కొన్ని రోజుల క్రితమే తన బిగ్ బాస్ ఎంట్రీపై ఒక వీడియోను రిలీజ్ చేసింది బర్రెలక్క. అందులో ఈ విధంగా చెప్పుకొచ్చింది. ‘బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్స్ జాబితాలో నా పేరు కూడా ఉంది. అయితే గత కొన్ని నెలలుగా నా ఫేమ్ బాగా తగ్గిపోయిందట. ఇప్పుడు నన్ను హౌస్ లోకి తీసుకెళ్లడం అంత అవసరమా? అని ఆలోచిస్తున్నారట. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, రాకున్నా నాకొచ్చిన ఇబ్బంది ఏం లేదు’ అని చెప్పుకొచ్చింది బర్రెలక్క. మరి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు బర్రెలక్క వైల్డ్ కార్ట్ ఎంట్రీతోనైనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. అసలే ఈసారి బిగ్ బాస్ లో తెలుగు వారి ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

బర్రెలక్క లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!