Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి సిద్ధి పేట కుర్రాడు.. అభయ్ నవీన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడో కంటెస్టెంట్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ నవీన్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. పెళ్లి చూపులు సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు మన తెలంగాణ లోని సిద్ది పేట ప్రాంతానికి చెందిన వాడే. ఇంజనీరింగ్ చదివాడు. చదువు అయిపోగానే బ్యాంక్ ఉద్యోగంలో కూడా జాయిన్ అయిపోయాడు.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి సిద్ధి పేట కుర్రాడు.. అభయ్ నవీన్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
Bigg Boss 8, Abhai Naveen
Follow us

|

Updated on: Sep 01, 2024 | 8:59 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడో కంటెస్టెంట్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ నవీన్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. పెళ్లి చూపులు సినిమాతో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు మన తెలంగాణ లోని సిద్ది పేట ప్రాంతానికి చెందిన వాడే. ఇంజనీరింగ్ చదివాడు. చదువు అయిపోగానే బ్యాంక్ ఉద్యోగంలో కూడా జాయిన్ అయిపోయాడు. ఇదే సమయంలో అభయ్ చలాకీ మాటలను చూసి అతని స్నేహితులు సినిమాల్లోకి వెళ్లమని సలహా ఇచ్చారట. దీనికి తోడు ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడంతో ఈ ట్యాలెంటెడ్ కుర్రాడు హర్ట్ అయ్యాడట. అంతే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బొమ్మల రామారం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్‌ పాత్రలో అద్భుతంగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించాడు అభయ్. ఇటీవలే రామన్న యూత్ సినిమాతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ సినిమాను స్వయంగా అతనే డైరెక్ట్ చేయడం విశేషం.

కొన్ని రోజుల క్రితం థియేటర్లలో రిలీజైన రామన్న యూత్ సినిమా ఆడియెన్స్ మెప్పు పొందింది. ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కింది. ప్రస్తుతం నటుడిగా రాణిస్తూనే దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు అభయ్ నవీన్.

ఇవి కూడా చదవండి

మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ..

కాగా బిగ్ బాస్ అవకాశంపై స్పందించిన అభయ్ నవీన్.. తన కలనిజమైందంటూ ఎమోషన్ అయ్యాడు.  ఇంతలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. మరి ఈ బిగ్ బాస్ క్రేజ్, పాపులారిటీని అభయ్ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

అభయ్ నవీన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

B Naveen Kumar (@abhainaveen) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.