AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: హౌస్‏లోకి నాలుగో కంటెస్టెంట్‏గా రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. అర్దరాత్రి స్కూటీపై అలా..

స్వాతి చినుకులు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన యష్మీ.. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది. ఇటీవల స్టార్ మాలో వచ్చిన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో నటించి మెప్పించింది. ఇక రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి కలిపి జంటగా హౌస్ లోకి పంపించాడు నాగార్జున. ఇక వీరిద్దరి తర్వాత మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ అడుగుపెట్టాడు.

Bigg Boss 8 Telugu: హౌస్‏లోకి నాలుగో కంటెస్టెంట్‏గా రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. అర్దరాత్రి స్కూటీపై అలా..
Prerana
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2024 | 8:19 PM

Share

బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఈసారి కూడా హౌస్ లోకి సీరియల్ బ్యాచ్ హడావిడి ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి కంటెస్టెంట్ యష్మీ గౌడ. స్వాతి చినుకులు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన యష్మీ.. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది. ఇటీవల స్టార్ మాలో వచ్చిన కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద పాత్రలో నటించి మెప్పించింది. ఇక రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి కలిపి జంటగా హౌస్ లోకి పంపించాడు నాగార్జున. ఇక వీరిద్దరి తర్వాత మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ అడుగుపెట్టాడు.

పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా కనిపించి మెప్పించాడు అభయ్. ఈ చిత్రంతో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మెప్పించాడు. రామన్న యూత్ సినిమా స్వయంగా తెరకెక్కించాడు. ఇక నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. ఆమె సైతం కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో కృష్ణ పాత్రలో అల్లరి పిల్లగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెట్టిన యష్మీ గౌడ, ప్రేరణ ఇద్దరు కలిసి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటించారు. ఈ సమయంలో వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు.

ఇప్పుడు వీరిద్దరు ఎనిమిదో సీజన్లో వీరిద్దరు టైటిల్ కోసం పోటీపడడం ఖాయమని తెలుస్తోంది. అయితే ప్రేరణ నటిగానే కాదు మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా. తనకు గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. అన్నిరకాల స్పోర్ట్స్ ఆడతానంటూ చెప్పుకొచ్చింది. తనతో పోటీపడే కంటెస్టెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రేరణ హీరోయిన్ రష్మిక మందన్నా క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇద్దరూ కలిసి ఒకే రూంలో ఉండేవారమని.. అడిషన్స్ కోసం పెద్ద లగేజీ పట్టుకుని అర్దరాత్రిళ్లు స్కూటీపై వెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఇద్దరు మంచి ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ప్రేరణకు పెళ్లి జరిగి ఎనిమిది నెలలే అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్