AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో.. రెండు గ్రామాలను దత్తత తీసుకుని హౌస్‌లోకి ఎంట్రీ..

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఐదో కంటెస్టెంట్ గా ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిశాడు. హీరోగానే కాకుండా విలన్ గానూ తన ట్యాలెంట్ చూపించాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేక పోయాడు

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో.. రెండు గ్రామాలను దత్తత తీసుకుని హౌస్‌లోకి ఎంట్రీ..
Bigg Boss 8, Aditya Om
Basha Shek
|

Updated on: Sep 01, 2024 | 9:03 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఐదో కంటెస్టెంట్ గా ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చాడు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిశాడు. హీరోగానే కాకుండా విలన్ గానూ తన ట్యాలెంట్ చూపించాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేక పోయాడు. ఇప్పటికీ ఆదిత్య ఓం సినిమాలు చేస్తున్నాడు. వీటికి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు వస్తున్నాయి. కానీ కమర్షియల్ గా ఫెయిల్ అవుతున్నాయి. కాగా చేతిలో సినిమాలు లేని సమయంలో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట ఈ ట్యాలెంటెడ్ హీరో. కనీసం గది నుంచి బయటకు కూడా రాలేకపోయాడట. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడట. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో మానసిక ఒత్తిడిని అధిగమించి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాడట.

సినిమాల సంగతి పక్కన పెడితే ఆదిత్య ఓం రియల్ హీరో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా మందికి తెలియవు. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడట ఆదిత్య ఓమ్. అక్కడ ఉండే దాదాపు 500 మందికి తన వంతు ఆర్థిక సాయం చేశాడట.

ఇవి కూడా చదవండి

ఐదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన ఆదిత్య ఓం..

అంతేకాదు అక్కడి పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడట. ఇలా సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటోన్న ఆదిత్యం ఓం బిగ్ బాస్ షోతో మళ్లీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ హౌస్ లో అతను ఏమేర జనాలను ఎంటర్ టైన్ చేస్తాడో.

 నటుడు ఆదిత్య ఓం లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Aditya Om (@theadityaom) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!