Thalapathy Vijay: ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమేంటో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నాట ఈ హీరోకు అశేషమైన అభిమానులు ఉన్నారు. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ స్థాపించారు. ఇటీవల పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక రాజకీయాల కోసం భవిష్యత్‌లో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా సిద్ధం అయ్యాడీ స్టార్ హీరో.

Thalapathy Vijay: ప్రైవేట్ జెట్‌లో షిర్డీ వెళ్లిన దళపతి విజయ్.. కారణమేంటో తెలుసా?
Thalapathy Vijay
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2024 | 9:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నాట ఈ హీరోకు అశేషమైన అభిమానులు ఉన్నారు. ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ స్థాపించారు. ఇటీవల పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. ఇక రాజకీయాల కోసం భవిష్యత్‌లో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా సిద్ధం అయ్యాడీ స్టార్ హీరో. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవడానికి చెన్నై నుంచి మహారాష్ట్రకు ప్రైవేట్ జెట్‌లో వెళ్లారట. మరి కొద్ దిరోజుల్లో ప్రజల దగ్గరకు విజయ్‌ వెళ్లబోతున్నారు. ఈ క్రమంలో ముందుగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోవాలని తన తల్లి శోభ సూచించడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌ తల్లి శోభ సాయిబాబా భక్తురాలు. ఆమ్మపై ప్రేమతో కొద్ది రోజుల క్రితం చెన్నైలో సాయిబాబా గుడి కూడా నిర్మించారు విజయ్. లారెన్స్ లాంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. కాగా

కాగా ఇటీవలే పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌ సెప్టెంబర్‌ 23న తిరుచ్చిలో మొట్ట మొదటి సారిగా మానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట. అంతకు ముందే షిరిడీ సాయినాథుడిని దర్శించుకుంటే బాగుంటుందని తల్లి సూచించడంతో ఆయన ప్రైవేట్ జెట్ లో మహారాష్ట్రకు వెళ్లారట.

ఇవి కూడా చదవండి

ఇక విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం గోట్‌ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. నటుడు మైక్‌ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్, నటి మీనాక్షీ చౌదరి, స్నేహా, లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.