Tollywood: గోవిందా గోవిందా మూవీ ఛైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో తెలుసా? అసలు ఊహించలేరు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'గోవిందా గోవిందా'. వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ తెరకెక్కంచిన ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. 1994లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ప్లాఫ్ అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Tollywood: గోవిందా గోవిందా మూవీ ఛైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో తెలుసా? అసలు ఊహించలేరు
Govinda Govinda Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 29, 2024 | 7:14 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని అందగాడు కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘గోవిందా గోవిందా’. వైజయంతీ మూవీస్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ తెరకెక్కంచిన ఈ సినిమాలో దివంగత నటి శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. 1994లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ప్లాఫ్ అయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులోని కొన్ని సీన్స్, పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఈ సినిమాలో నాగ్, శ్రీదేవిలతో పాటు ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ కూడా కీలక పాత్ర పోషించాడు. అతనే అనిల్ రాజ్. అమలా పురంలో పుట్టి పెరిగిన కుర్రాడు చిన్నప్పుటి నుంచే ఆట పాటల్లో రాణించాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు. అలాగే లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కూడా దక్కించుకున్నాడు. అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడ్డాడు. గోవిందా గోవిందా సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అందులో అనిల్ రాజ్ పోషించిన పాత్రకు ప్రశంసలు కూడా వచ్చాయి. గోవిందా గోవిందా షూటింగ్ సమయంలోనే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అనిల్ ప్రతిభను గుర్తించారు. తన సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. అలా అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, రాజసింహం వంటి చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ముద్దుల ప్రియుడు సినిమాలో హీరో వెంకటేశ్ ను ఆటపట్టించే గ్యాంగ్ లోనూ కనిపిస్తాడు అనిల్ రాజ్. అయితే ఈ మూడు సినిమాల తర్వాత వెండితెరపై కనిపించలేదు. చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయాడు.

కాగా అనిల్ రాజ్ హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ ను పూర్తి చేశాడు. ఆ తర్వాత బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సను కూడా పూర్తి చేశాడు. చాలా మంది హీరోల్లాగే అతను కమ్ బ్యాక్ ఇద్దామని యాక్టింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. అయితే ఎందుకోగానీ అది సాధ్యం కాలేదు. ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ గతంలో నటించిన బాల నటులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చింది. గోవిందా గోవిందా మూవీ నటుడు అనిల్ రాజ్ కూడా ఈ కార్యక్రానికి వచ్చాడు. అయితే ఎక్కువ సేపు మాట్లాడలేదు. కానీ అనిల్ రాజ్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. చాలామంది మొదటి సారి అతనిని చూసి గుర్తుపట్టలేకపోయారు. అయితే అనిల్ రాజ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడన్న విషయాలేవీ తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

అనిల్ రాజ్ లేటెస్ట్ ఫొటోస్..

Anil Raj

Anil Raj

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!