OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ తెలుగు సినిమాలు.. ఫుల్ లిస్ట్

మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల పూర్తి కానుంది. ఈనెలలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ, ధనుష్ రాయన్, కమల్ హాసన్ భారతీయుడు 2, మమ్ముట్టి టర్బో, డెరిక్ అబ్రహం వంటి ఆసక్తికర సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఆడియెన్స్ ఆదరణతో ఈ మూవీస్ కు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇక వచ్చే నెల సెప్టెంబర్ లోనూ పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ తెలుగు సినిమాలు.. ఫుల్ లిస్ట్
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2024 | 5:00 PM

మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల పూర్తి కానుంది. ఈనెలలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ, ధనుష్ రాయన్, కమల్ హాసన్ భారతీయుడు 2, మమ్ముట్టి టర్బో, డెరిక్ అబ్రహం వంటి ఆసక్తికర సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఆడియెన్స్ ఆదరణతో ఈ మూవీస్ కు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఇక వచ్చే నెల సెప్టెంబర్ లోనూ పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నెలలో థియేటర్లలో రిలీజైన సినిమాలన్నీ దాదాపు వచ్చే నెలలో ఓటీటీలోకి రానున్నాయి. అలా రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ తో పాటు మరికొన్ని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేయనున్నాయి. ఇక గత కొన్ని నెలలుగా స్ట్రీమింగ్ కు నోచుకుని సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా సెప్టెంబర్ లో రిలీజయ్యే అవకాశముంది. మరి సెప్టెంబర్ లో వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే తెలుగు సినిమాలేవో తెలుసుకుందా రండి.

కమిటీ కుర్రోళ్లు.

మెగాడాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి రూపొందించిన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్లు. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ రూరల్ కామెడీ డ్రామా చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ సహా మరికొందరు లీడ్ రోల్స్ చేశారు.ఆగస్టు 09న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుందని టాక్. అయితే ఏ ఓటీటీ అయినా సెప్టెంబర్ నెలలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. సెప్టెంబర్‌లోనే ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6లేదా 7వ తేదీన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

డబుల్ ఇస్మార్ట్

రామ్ పోతినేని హీరోగా నటించిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సెప్టెంబర్ రెండో వారం లేకపోతే మూడో వారం ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావచ్చు.

ఆయ్

ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీ కూడా సెప్టెంబర్ లోనే స్ట్రీమింగ్ కు రానుంది. నెట్‍ఫ్లిక్స్ లో ఆయ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.