Atlee: అట్లీతో అల్లు అర్జున్ మూవీ లేనట్టే! ఆ స్టార్ హీరోతో సినిమాకు సిద్ధమైన స్టార్  డైరెక్టర్ 

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. తమిళంలో సూపర్ హిట్ చిత్రాలను అందించిన తర్వాత అతను బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అట్లీ-షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'జవాన్‌' బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అయింది. ఆ సినిమా విజయం సాధించడంతో మరో స్టార్ హీరో..

Atlee: అట్లీతో అల్లు అర్జున్ మూవీ లేనట్టే! ఆ స్టార్ హీరోతో సినిమాకు సిద్ధమైన స్టార్  డైరెక్టర్ 
Allu Arjun, Atlee
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2024 | 8:20 AM

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. తమిళంలో సూపర్ హిట్ చిత్రాలను అందించిన తర్వాత అతను బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అట్లీ-షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ అయింది. ఆ సినిమా విజయం సాధించడంతో మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా అట్లీతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. కాగా సల్మాన్ కు ఇప్పట్లో ఒక భారీ హిట్ చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘టైగర్ 3’ సినిమాలు సల్మాన్ ఖాన్ అభిమానులను నిరాశపరిచాయి. కాబట్టి ఈ హీరోకు పెద్ద హిట్ కావాలి. ఇందుకోసమే ఇప్పుడు సౌత్ సినిమా దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు అట్లీతో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ప్రకటనకు డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మరో సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘సికందర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రష్మిక మందన్న, సల్మాన్ ఖాన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ అట్లీతో సినిమా తీయాలని అనుకుంటున్నారు. అట్లీతో సినిమా చేస్తే సల్మాన్ ఖాన్ కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సల్లూ కూడా ఇదే అనుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ 30న ఈ కొత్త సినిమాని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నుంచి కానీ, అట్లీ వైపు నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలీవుడ్ జనాల ఫేవరెట్ డైరెక్టర్ అట్లీ అన్నది కూడా నిజం. ఆ డిమాండ్ మేరకు వారి రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయింది. అందుకే ఈ మధ్యన అట్లీ బాలీవుడ్ వ్యక్తుల పార్టీలలో తరచుగా కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.