AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా.. ఇప్పటివరకు ఫిక్స్‌ అయిన కంటెస్టెంట్స్ వీరే

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8లోకి మరో కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ బాషా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అతని ఎంపికకు సంబంధించి బుధవారం (ఆగస్టు 28) ఏవీ షూట్ చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారంలో శేఖర్ బాషా పేరు ప్రముఖంగా వినిపించింది

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి రాజ్ తరుణ్ ఫ్రెండ్ శేఖర్ బాషా.. ఇప్పటివరకు ఫిక్స్‌ అయిన కంటెస్టెంట్స్ వీరే
Bigg Boss Telugu 8
Basha Shek
|

Updated on: Aug 26, 2024 | 4:55 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సెప్టెంబర్ 1 నుంచి మరో కొత్త సీజన్ తో మ న ముందుకు రానున్నాడు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని, లిస్టులో ఉన్న వారందరికీ ఫోన్లు వెళ్లాయని సమాచారం. మరోవైపు కంటెస్టెంట్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. కంటెస్టెంట్ల లిస్టు పూర్తిగా మారిపోయిందని, చాలా మంది ఈ షో నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి రానున్నారని వార్తల వస్తున్నాయి. కాగా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8లోకి మరో కంటెస్టెంట్‌గా ఆర్జే శేఖర్ బాషా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అతని ఎంపికకు సంబంధించి బుధవారం (ఆగస్టు 28) ఏవీ షూట్ చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారంలో శేఖర్ బాషా పేరు ప్రముఖంగా వినిపించింది. దీనికి ముందు కొన్ని మ్యూజిక్ ఛానెల్స్ లో యాంకర్ గా పనిచేశాడు శేకర్ బాషా. అలాగే ఆర్జేగానూ సత్తా చాటాడు. ఇక రాజ్ తరుణ్ పై లావణ్యవన్నీ తప్పుడు ఆరోపణలంటూ నిరూపించేందుకు అతను పెద్ద యుద్ధమే చేశాడు. న్యూస్ ఛానెల్స్ కు వెళ్లి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చి బాగా వార్తల్లో నిలిచాడు. ఆ మధ్యన లావణ్య సంబంధీకులు తనపై దాడి చేశారంటూ ఆస్పత్రిలో కూడా కనిపించాడు.

ఇక శేఖర్ బాషాతో పాటు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే పలువురి సెలబ్రిటీలు పేర్లు దాదాపు కన్ఫర్మ్ అయ్యాయని సమాచారం. ఇందులో యాంకర్ విష్ణుప్రియ, డ్యాన్సర్, హీరోయిన్ విస్మయ శ్రీ , రీతూ చౌదరి పేర్లు దాదాపుగా ఫిక్స్ అయ్యాయట. అలాగే ఇంద్రనీల్, నిఖిల్ మిలిక్కల్, ఆదిత్య ఓం, సౌమ్య రావు, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, అంజలి పవన్, అభిరామ్ వర్మతోపాటు కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్జే శేఖర్ బాషా ఫైనల్ అయినట్టేనా?

అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. అలాగనీ ఇందులో అన్నీ అవాస్తవాలే అని చెప్పడం లేదు. బిగ్ బాస్ షో ప్రారంభానికి కేవలం 5 రోజులు సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్స్ లిస్టు పూర్తిగా కావాలంటే అప్పటివరకు ఓపికగా ఎదురు చూడక తప్పదు.

ఫైనల్ అయిన కంటెస్టెంట్స్ వీరే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..