AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. అభిమానులకు నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే?

హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ సెంటర్ ను హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) బృందం కూల్చివేసింది. మాదాపూర్ లోని ఈ కన్వెన్షన్ సెంటర్ ను తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి నిర్మిచారని ఆరోపణు ఉన్నాయి. దీంతో అధికారులు శనివారం ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా కూల్చివేశారు. దీనిపై నాగార్జున కోర్టు ను ఆశ్రయిచారు.

Nagarjuna: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. అభిమానులకు నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే?
Nagarjuna Akkineni
Basha Shek
|

Updated on: Aug 25, 2024 | 8:50 PM

Share

హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్‌ సెంటర్ ను హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) బృందం కూల్చివేసింది. మాదాపూర్ లోని ఈ కన్వెన్షన్ సెంటర్ ను తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి నిర్మిచారని ఆరోపణు ఉన్నాయి. దీంతో అధికారులు శనివారం ఉదయం ఈ కన్వెన్షన్ సెంటర్ ను పూర్తిగా కూల్చివేశారు. దీనిపై నాగార్జున  కోర్టు ను ఆశ్రయిచారు. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఇది వరకే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించారు కింగ్. చట్టాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషలకు ప్రత్యేక విజ్జప్తి చేశారు నాగ్. ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ.. N -కన్వెన్షన్‎ సెంటర కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు నాగార్జున.

అంతకు ముందు మరో ట్వీట్ లో ఇలా రాసుకొచ్చారు నాగార్జున. ‘స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలిపేందుకే ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు ఇచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత ప్రక్రియ నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు నాగ్.

ఇవి కూడా చదవండి

నాగార్జున ట్వీట్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్