AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toofan OTT: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ సినిమా తుఫాన్. త‌మిళంలో మ‌జై పిడిక్కాథ మ‌ణితాన్ పేరుతో ఈ మూవీ రిలీజైంది. విజయ్‌ మిల్టన్‌ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. అలాగే సత్యరాజ్, శరత్‌ కుమార్, మురళీ శర్మ, పుష్ప డాలీ ధనుంజయ తదితర స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 02న తమిళంలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Toofan OTT: తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Toofan Movie
Basha Shek
|

Updated on: Aug 23, 2024 | 1:01 PM

Share

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అండ్ డైరెక్టర్ విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ సినిమా తుఫాన్. త‌మిళంలో మ‌జై పిడిక్కాథ మ‌ణితాన్ పేరుతో ఈ మూవీ రిలీజైంది. విజయ్‌ మిల్టన్‌ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. అలాగే సత్యరాజ్, శరత్‌ కుమార్, మురళీ శర్మ, పుష్ప డాలీ ధనుంజయ తదితర స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 02న తమిళంలో రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓ మోస్తరు వసూళ్లను కూడా సాధించింది. అయితే అప్పటికే ప‌లు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు బాక్సాఫీస్ బ‌రిలో నిల‌వ‌డంతో పది రోజులు ఆలస్యంగా అంటే ఆగ‌స్ట్ 11న తెలుగు వెర్ష‌న్ తుఫాన్ రిలీజ్ చేశారు. అయితే తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో ఉండ‌గానే ఈ మూవీ తమిళ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 15 నుంచే ఈ థ్రిల్లర్ మూవీ ఒరిజినల్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా తుపాన్‌ తెలుగు వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లోనే తుఫాన్ తెలుగు వెర్షన్ తో పాటు కన్నడ , మలయాళం వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా తుపాన్ మూవీని నిర్మించారు. ఐదుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఈ సినిమాకు ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. విజ‌య్ ఆంటోనీతో పాటు అచ్చు రాజ‌మ‌ణి, రాయ్‌, హ‌రీ ద‌ఫుసీయా, వ‌గు మ‌జ‌న్ తుఫాన్ సినిమాకు బాణీలు అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో ఒక సీక్రెట్ ఏజెంట్. వృత్తి లో భాగంగా ఓసారి అండమాన్ దీవుల్లోని ఓ ఊరికి వెళతాడు. అక్కడ డాలీ అనే ఓ వడ్డీ వ్యాపారి ఆ ఊరి ప్రజలను పీడిస్తుంటాడు. అందులో హీరోయిన్ కూడా బాధితురాలిగా ఉంటుంది. దీంతో డాలి నుంచి అక్కడి ప్రజలను ఎలా అయినా కాపాడాలని అనుకుంటాడు హీరో. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అతను చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఏంటో తెలుసుకోవాలంటే తుపాన్ సినిమా చూడాల్సిందే అంటున్నార మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి తుఫాన్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?