Ayesha Takia: నాగార్జున సూపర్ మూవీ హీరోయిన్‌కు ఏమైంది? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అయేషా.. షాక్‌లో ఫ్యాన్స్‌

అక్కినేని నాగార్జున హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా సూపర్. 2005లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగార్జునతో పాటు సోనూసూద్ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమాతోనే అనుష్కా శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇదే సూపర్ సినిమాతోనే బాలీవుడ్ అందాల తార అయేషా టకియా కూడా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Ayesha Takia:  నాగార్జున సూపర్ మూవీ హీరోయిన్‌కు ఏమైంది?  గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అయేషా.. షాక్‌లో ఫ్యాన్స్‌
Ayesha Takia
Follow us
Basha Shek

|

Updated on: Aug 22, 2024 | 2:04 PM

అక్కినేని నాగార్జున హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా సూపర్. 2005లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగార్జునతో పాటు సోనూసూద్ మరో కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమాతోనే అనుష్కా శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఇదే సూపర్ సినిమాతోనే బాలీవుడ్ అందాల తార అయేషా టకియా కూడా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో తన అందంతో కుర్రాళ్ల హృదయాలను మెలిపెట్టింది. ముఖ్యంగా ‘గుచ్చి గుచ్చి చంపమాకు ఓయ్‌ లా’ పాట అప్పట్లో కుర్రకారను ఒక ఊపు ఊపేసింది. అయేషా టకియా నటించిన ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే హిందీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ‘షాదీ సే పెహ్లే’, ‘షాదీ నెం. 1’, ‘యు హోతా తో క్యా హోతా’, ‘సలామ్-ఎ-ఇష్క్’, ‘డోర్ అండ్ ఫూల్’, ‘వాంటెడ్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది అయేషా టకియా. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే 2009లో రాజకీయ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుందీ అందాల తార. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది అయేషా టకియా.

ఇవి కూడా చదవండి

కాగా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్పప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది అయేషా. అందులో తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అయితే అయేషా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటోను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇందులో ఆమె అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. నిజానికి ఆమె అయేషా టకియా అంటే చాలా మంది నమ్మలేకపోతున్నారు. గోల్డ్ కలర్ శారీ, పింకో టోన్డ్ మేకప్ తో ఉన్న ఆమెను చూసి అందరూ నిర్ఘాంత పోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.’ కొందరు ఆమె అయేషా టకియా కాదని అంటుంటే, మరికొందరు మాత్రం ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని, అందుకే ఇలా మారిపోయందని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇది నిజమైన ఫోటేయేనా? ఇంకొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయేషా టకియా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

అసలేమైంది అయేషాకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!