Madhavi: ఒకప్పటి చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ మాధవి కూతుళ్లను చూశారా? అందంలో అమ్మను మించిపోయారుగా

వెండితెరపై తమ అందం, అభినయంతో అలరించిన తారల్లో చాలామంది హఠాత్తుగా కనుమరుగైపోయారు. కొందరు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలయ్యారు. మరికొందరు సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా ఉంటూ రహస్యంగా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. వీరిలో సీనియర్‌ నటి మాధవి కూడా ఒకరు.

Madhavi: ఒకప్పటి చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ మాధవి కూతుళ్లను చూశారా? అందంలో అమ్మను మించిపోయారుగా
Actress Madhavi
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2024 | 12:19 PM

వెండితెరపై తమ అందం, అభినయంతో అలరించిన తారల్లో చాలామంది హఠాత్తుగా కనుమరుగైపోయారు. కొందరు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలయ్యారు. మరికొందరు సెలబ్రిటీ లైఫ్‌కు దూరంగా ఉంటూ రహస్యంగా సింపుల్‌గా లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. వీరిలో సీనియర్‌ నటి మాధవి కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాధవి 80-90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తన అందం, అభినయంతో శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్‌ హీరోయిన్లకు గట్టి పోటీ నిచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి అయితే అప్పట్లో ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ. వీరి కాంబినేషన్ లో ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య, చట్టంతో పోరాటం, మరణశాసనం, రోషగాడు, కోతల రాయుడు, దొంగమొగుడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బిగ్ బాస్ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఖైదీ సినిమాలో ‘రగులుతోంది మొగలిపొద’ పాటకు మెగాస్టార్ తో పోటీపడి మరీ డ్యాన్స్ చేసింది మాధవి. అప్పట్లోనే ఓ సినిమాలో బికినీలో కనిపించి కుర్రకారు మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ అదే సమయంలో మాతృదేవోభవ సినిమాలో అందరితో కంటతడి పెట్టించింది. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి లాంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది మాధవి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది.

కాగా సినిమాకెరీర్ పీక్స్‌లో ఉండగానే.. బిజినెస్‌మెన్ రాల్ఫ్ శర్మని 1996లో పెళ్లి చేసుకుంది మాధవి. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం ఆమె భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉంటోంది. ఇక పోతే మాధవికి ముత్యాల్లాంటి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే మాధవి అప్పుడప్పుడు తమ కూతుళ్ల ఫొటోలను అందులో షేర్ చేస్తుంటారు. పెద్ద కూతురు పేరు టిఫనీ, రెండో కూతురు ప్రిసిల్లా, ఇక మూడో కూతురు పేరు ఎవలిన్. తన లాగే తన ముగ్గురి పిల్లలకు భరత నాట్యంలో శిక్షణ ఇప్పించింది మాధవి. ఇక అందం విషయానికి వస్తే.. ఈ ముగ్గురు కూతుళ్లు అమ్మను మించి పోయారు. అయితే వీరు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వీరు చదువుకుంటూనే వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

సీనియర్ నటి మాధవి, ఆమె ముగ్గురు కూతుళ్ల ఫొటోలు ఇదిగో..

Actress Madhavi 1

Actress Madhavi 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో