AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paape Maa Jeevanajyothi: ‘పాపే మా జీవనజ్యోతి’ సీరియల్లో పద్దతిగా ఉండే కుట్టీ.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..

అందం, అభినయంతో తెలుగు రాష్ట్రాల్లోని జనాలను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్లలో పాపే మా జీవన జ్యోతి ఒకటి. బెంగాలీ సీరియల్ మా టోమే చరా గుమ్ అసేనా రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. 2021 నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో సూర్య ప్రసాద్ పాత్రలో ప్రియతమ్ నటించగా..

Paape Maa Jeevanajyothi: 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్లో పద్దతిగా ఉండే కుట్టీ.. నెట్టింట సెగలు పుట్టిస్తోందిగా..
Hemashree
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2024 | 2:52 PM

Share

బుల్లితెరపై సీరియల్స్ హవా ఓ రేంజ్‏లో ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ అడియన్స్, మహిళలు టీవీలకు అతుక్కుపోయి పలు ధారావాహికలను చూస్తుంటారు. అలాగే ఆ సీరియల్లలో నటించే హీరోహీరోయిన్లకు ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉంటారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇతర భాష నటీనటులు తెగ సందడి చేస్తున్నారు. తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఎక్కువ శాతం పరభాష నటీనటులే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయంతో తెలుగు రాష్ట్రాల్లోని జనాలను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్లలో పాపే మా జీవన జ్యోతి ఒకటి. బెంగాలీ సీరియల్ మా టోమే చరా గుమ్ అసేనా రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. 2021 నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో సూర్య ప్రసాద్ పాత్రలో ప్రియతమ్ నటించగా.. అతడి భార్య జ్యోతి పాత్రలో బుల్లితెర క్వీన్ పల్లవి రామిశెట్టి నటిస్తుంది. ఆ సీరియల్ నుంచి ఆమె తప్పుకోవడంతో పల్లవి పాత్రలోకి జ్యోతి ఎంటరయ్యింది. ఇక సూర్య, జ్యోతిల కూతురిగా మెయిన్ రోల్ పోషిస్తుంది హేమ శ్రీ. ఈ సీరియల్లో కుట్టీ, ఆనందిగా కనిపిస్తుంది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇందులో బస్తీ అమ్మాయిగా సింపుల్ లుక్ లో కనిపించి మెప్పించింది.

కుట్టీ పాత్రలో నటిస్తు్న్న అమ్మాయి హేమ శ్రీ. కన్నడ నటి. బెంగుళూరులో బీటెక్ పూర్తి చేసిన హేమశ్రీకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో చదువుకుంటున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు కన్నడ సీరియల్స్ చేసింది. కన్నడతి, రాధే శ్యామ్, హిట్లర్ కళ్యాణ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన క్యూట్ నటనతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన హేమ శ్రీ.. ఇప్పుడు తెలుగులో పాపే మా జీవనజ్యోతి సీరియల్లో నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటుంది హేమ శ్రీ. అయితే ఈ సీరియల్లో పంజాబీ డ్రెస్సులు, లంగావోణిలలో తెలుగింటి అమ్మాయిల కనిపించే హేమ శ్రీ.. సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చిట్టి పొట్టి డ్రెస్సులతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు సీరియల్స్ లో సంప్రదాయంగా కనిపించిన హేమశ్రీ.. నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ చూస్తే నోరేళ్లబెట్టాల్సిందే. సహజ నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన హేమశ్రీ.. మోడ్రన్ లుక్స్ లో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంటుంది. పాపే మా జీవనజ్యోతి సీరియల్ ఇప్పటివరకు వెయ్యికి పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.