Bigg Boss Telugu 8: వివాదాల వేణు స్వామి బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారా? లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, లిస్టులో ఉన్న అందరికీ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి

Bigg Boss Telugu 8: వివాదాల వేణు స్వామి బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తారా? లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో
Nagarjuna, Venu Swamy
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2024 | 7:58 AM

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, లిస్టులో ఉన్న అందరికీ ఫోన్ కాల్స్ వెళ్లినట్లు సమాచారం. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపికపై నెట్టింట చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇప్పటికే తెరపైకి ఎన్నో పేర్లు వచ్చాయి. అందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఒకరు. నాగ చైతన్య, శోభిత ల ఎంగేజ్ మెంట్ కు ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో స్వామీజీ పేరు వినిపించింది. అయితే ఇప్పుడొస్తున్న సమాచారం ప్రకారం.. ఈసారి హౌస్ లోకి వేణు స్వామి రావడం లేదట. ఎప్పుడైతే ఆయన నాగ చైతన్య, శోభితల వైవాహిక బంధంపై సంచలన కామెంట్స్ చేశారో అప్పుడే కంటెస్టెంట్ల లిస్టు నుంచి వేణు స్వామి పేరు తొలగించారట. బిగ్ బాస్ షోకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించడం, ఇప్పుడు ఆయన కాబోయే కోడలిపైనే వివాదాస్పద కామెంట్స్ చేయడంతో వేణు స్వామిని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు స్వామీజీపై అక్కినేని అభిమానుల్లోనూ పీకల దాకా కోపం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను బిగ్ బాస్ లోకి పిలవడం సరికాదని యాజమాన్యం భావిస్తోందట.

సాధారణంగా వివాదాస్పద వ్యక్తులను కూడా బిగ్ బాస్ షోలకు పిలుస్తుంటారు. అయితే వేణు స్వామి విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ అయిన మరుసటి రోజే వాళ్ల జాతకాలు చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు వేణు స్వామి. ఇదే విషయంపై ఆయనపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. త్వరలోనే స్వామీజీని అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇక ఇతర కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. స్టార్ కమెడియన్ కమ్ హీరో అభినవ్ గోమఠం కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని సమాచారం. అలాగే వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి తో పాటు ఆమె కూతురు సుప్రిత ఇలా చాలామంది సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో? తెలియాలంటే బిగ్ బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?