Brahmamudi, August 20th Episode: కళావతా మజాకా.. ఓ ఆట ఆడేసిందిగా.. వెంకీ-మీనా సీన్ రిపీట్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ వంట చేసి కళ్యాణ్‌కి పెడుతుంది. అది తిన్న కళ్యాణ్.. బాగానే ఉందని చెప్తాడు. బాగానే ఉందా అని.. అప్పూ తిని ఇదేంటి రా భయ్ ఇలా ఉందని అంటుంది. అస్సలు బాలేదు కదా.. బాగానే ఉందని ఎలా చెబుతున్నావ్? అని అడిగితే.. నీకు కోపం వస్తుందేమోనని చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నా.. నేను కోపిష్టినా? అని కోపంగా అడుగుతుంది. అబ్బే అస్సలు లేదు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అప్పూ వంట చేసి కళ్యాణ్‌కి పెడుతుంది. అది తిన్న కళ్యాణ్.. బాగానే ఉందని చెప్తాడు. బాగానే ఉందా అని.. అప్పూ తిని ఇదేంటి రా భయ్ ఇలా ఉందని అంటుంది. అస్సలు బాలేదు కదా.. బాగానే ఉందని ఎలా చెబుతున్నావ్? అని అడిగితే.. నీకు కోపం వస్తుందేమోనని చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. అంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నా.. నేను కోపిష్టినా? అని కోపంగా అడుగుతుంది. అబ్బే అస్సలు లేదు.. చూడు ఎంత కూల్‌గా అడుగుతున్నావో అని అంటాడు కళ్యాణ్. ఇంత వరకు వండి తినిపిస్తేనే తినేదాన్ని.. పాపం ఎంత బాధ పడుతుందో.. సరేలే నేను రెండు రోజుల్లో ఫర్ ఫెక్ట్‌గా వంట నేర్చుకుంటాను. అయితే ఇప్పుడు వచ్చిన డబ్బుల్లో సగం సరుకులు తెచ్చుకుని.. సగం దాచుకుందాం. నీకు ఉదయం లిస్ట్ రాసి పెడతానని అప్పూ అంటుంది. అలాగే కానీ.. మనం ఇలా మాట్లాడుకుంటే.. ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు. కాబట్టి ఇక నుంచి మనం ఇలా పిలుచుకోకూడదు.. ముద్దు పేర్లు పెట్టుకుందాం. సరే ఇక నుంచి నేను నిన్ను పొట్టి అని పిలుస్తానని కళ్యాణ్ చెప్తపాడు.
పొట్టి.. కూచి.. క్యూట్‌గా అప్పూ, కళ్యాణ్‌లు..
సరే నేను నిన్ను తాటి చెట్టు.. కల్లు అని పిలవనా.. బాగోదు.. కూచి అని పిలుస్తానని అప్పూ అంటుంది. ఇక ఇద్దరూ నవ్వుకుని తింటారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి.. అప్పూ, కళ్యాణ్‌ల గురించి బాధ పడుతూ ఉంటారు. అప్పుడే బంటి ఎంట్రీ ఇచ్చి.. పెద్దమ్మా ఆకలేస్తుంది.. ఏం వండావ్ అని అడుగుతాడు. అయ్యగారు వస్తారని.. చికెన్, మటన్ వండి పెట్టామని వెటకారంగా అంటుంది. దీంతో ఫీల్ అయిన బంటి.. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటాడు. బంటి తింటూ అప్పూ, కళ్యాణ్‌లను నా రూమ్‌కి తీసుకెళ్లి పెట్టాను. అప్పూని నా సొంత అక్క అనుకున్నాను కాబట్టే ఆ పని చేశాను. కానీ మీరు నన్ను కనీసం అద్దె కొడుకులా కూడా చూడటం లేదని బంటి అంటాడు. దీంతో కనకం, కృష్ణమూర్తిలు దగ్గరకు వచ్చి వాళ్లు ఎలా ఉన్నారని అడుగుతారు. కూతురు కనిపించలేదన్న కంగారులో అన్నాను నువ్వు కూడా నా కొడుకువే కదా అని అంటారు. అప్పూ అక్కని ఇంటికి తీసుకెళ్లానని అనే సరికి తెగ ప్రేమలు వచ్చేశాయని బంటి అంటాడు. ఎలా ఉన్నారని అడిగితే.. వాళ్లకు ఏంటి సూపర్‌గా ఉన్నారు.. అన్నీ నేనే చూసుకుంటానని బంటి అంటాడు. దీంతో పొంగిపోయిన కనకం.. నీకు ఏం కావాలో అన్నీ వండి పెడతానని కనకం అంటుంది.
రాజ్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన కావ్య..
ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్‌ని నిద్ర లేపుతూ.. శిల్పంలా నిల్చుంటుంది కావ్య. అది చూసి రాజ్ కంగారు పడతాడు. వరాలు ఇచ్చే దేవతలా ఆ ఫోజ్ ఏంటి? పొద్దున్నే మాకు ఇదేంటి? అని రాజ్ అంటే.. దర్శనం కాదు.. నిదర్శనమని కావ్య అంటుంది. సరే ఇటు ఇవ్వు అని రాజ్ అంటే.. ముందు 100 ఇవ్వండి.. అప్పుడు టీ ఇస్తాను. నేను మీ ఆస్తి కోసమే వచ్చాను కదా.. అందుకే ఈ పని. ఇక నుంచి అన్నీ మీకు లైవ్‌లో చూపిస్తానని కావ్య అంటే.. ముందు కాఫీ ఇస్తావా.. ఇవ్వవా అని రాజ్ అంటాడు. ఏంటి? నేను ఆస్తుల కోసం వెంపర్లు ఆడుతున్నానా? నాకు ఎలాంటి ఆస్తి రాసిచ్చారు? చిన్న ఇల్లా.. పెద్ద ఇల్లా.. ఇక నుంచి నేను ఈ ఇంట్లో చేసిన ప్రతీ పనికి వెల కడతాను. ఈ వెల.. 100 రూపాయాలు అని చెబుతుంది. ఏంటీ రివేంజా.. నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. అని రాజ్ అంటే.. మంచిది నేను ఈ టీ కప్పులో తుఫాను కిందుకు వెళ్లి పుట్టిస్తాను అంటూ స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తుంది కావ్య. నీకు కావాల్సింది డబ్బులే కదా అని తీసుకొచ్చి ఇస్తాడు రాజ్.
వెంకీ – మీనా సరుకుల సీన్ రిపీట్..
అయితే ఇక నుంచి నేను ఏం చెప్పినా డబ్బులు ఇవ్వాలి అన్నమాట అని రాజ్ అంటు.. అవును అని చెప్పి కావ్య వెళ్తుంది. సరే 50 అని చెబుతుంది. ఆ తర్వాత ప్రతీ పనికి డబ్బులు ఇస్తాడు రాజ్. ఇక రాజ్ చెప్పిన పనులు చేసి వెళ్తుంది కావ్య. దీంతో రాజ్ చిరుబురులాడుతూ ఉంటాడు. మీరు కిందకు రండి.. కింద అన్నింటికీ న్యాయం చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత అప్పూ ఉల్లి పాయలు కోస్తూ ఏడుస్తుంది. అప్పుడే కళ్యాణ్ వచ్చి ఏడుస్తున్నావేంటి? అని అడుగుతాడు. ఉల్లిపాయ అని చెబుతుంది అప్పూ. సరే నీకు ఓ సర్ ప్రైజ్.. అది చూడగానే నువ్వు నన్ను హగ్ చేసుకుంటావ్.. అని చెప్పి బట్టలు చూపిస్తాడు కళ్యాణ్. అది చూసి అప్పూ కంగారు పడుతుంది. సేమ్ విక్టరీ వెంకటేష్ నటించిన.. ‘సూర్యవంశం’ సినిమాలోని సీన్ రిపీట్ అవుతుంది. మీనా – వెంకటేష్ సరుకుల సీన్ హైలెట్ అయ్యింది కదా.. అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇక దీంతో ఏంటా అని ఆలోచిస్తారు.
తికమక పెట్టిన కావ్య.. బిత్తరపోయిన రుద్రాణి, అపర్ణలు..
ఆ తర్వాత కావ్యని పిలిచి.. కాఫీ ఇస్తావా? అని అడుగుతుంది ఇందిరా దేవి. కాఫీకి 100 రూపాయాలు అని కావ్య చెబుతుంది. అది విన్న రాజ్ కంగారు పడతాడు. 100 ఏంటి? అని రుద్రాణి అడుగుతుంది. ఇక రుద్రాణిని తికమక పెడుతూ ఉంటుంది. రాజ్ అడ్డుకుని ఏయ్ ఏయ్ ఆగు అని అంటాడు. అసలు ఏం జరిగిందని పెద్దావిడ అడుగుతుంది. టిఫిన్ అయినా భోజనం అయినా ఇక నుంచి ఆర్డర్ మీదనే చేయబడతాయని కావ్య అంటుంది. అయితే 500 + జీఎస్టీ + సర్వీస్ చార్జెస్ అని అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావ్? అమ్మా అని ఇందిరా దేవి అంటే.. మీకు తెలీదా అమ్మమ్మా అని కావ్య చెప్పబోతుండగా.. రాజ్ అడ్డుకుంటాడు. ఇలా పెద్దావిడను తికమక పెడుతుంది కావ్య. అసలు ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు.. టిఫిన్లకు రేట్లు ఏంటి? కాఫీలకు రేట్లు ఏంటి అని అడుగుతారు. అప్పుడే అపర్ణ వచ్చి కావ్యా టీ తీసుకురమ్మని చెబుతుంది. 100 రూపాయలు అత్తయ్యా అని అంటుంది కావ్య. దీంతో రాజ్ అడ్డుకుని ఏయ్.. పిచ్చి పట్టిందా? అని అంటాడు. అపర్ణ షాక్ అవుతుంది. మీకేమన్నా అర్థయ్యిందా.. అని అందరూ అనుకుంటారు. ఇక రాజ్ మ్యానేజ్ చేస్తూ.. కావ్యని బయటకు తీసుకెళ్తాడు రాజ్.
రాజ్‌ని కడిగి పారేసిన రాజ్..
నేను మీ ఆస్తుల కోసం ఆసపడ్డానా? వాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ మీకేం అయ్యింది? నేను ఆస్తుల కోసం ఆశ పడ్డానా? ఏమన్నా కష్టం వస్తే మీ ఆస్తిని నా పుట్టింటికి దోచిపెట్టానా? ఏ రీజన్‌తో అన్నారని కావ్య నిలదీస్తుంది. నువ్వు ఏదో తిక్కల మేళం అనుకుని ఇచ్చాను. ఇప్పుడు అందరికీ బిల్లులు వేస్తావా? అవును నాకు ఆస్తి పిచ్చి ఉంది. మీ ఆస్తులు రాయించుకోవాలి అనుకుంటున్నా అని గట్టి వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఇక ఇక్కడితో ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.