Guava Leaves: జామ చెట్టు ఆకులను ఇలా వాడారంటే షుగర్, బీపీకి బైబై చెప్పొచ్చు..

జామ కాయలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. జామ పండు తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. జామ కాయని పేదోడి యాపిల్ అని అంటారు. యాపిల్ తినలేని వారు జామ పండును తినవచ్చు. జామ కాయలు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలోనే ఉంటాయి. కాబట్టి జామ పండ్లను ఎవరైనా తినవచ్చు. జామ పండు తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. యాపిల్‌లో ఉండే పోషకాలన్నీ జామ కాయలో..

Guava Leaves: జామ చెట్టు ఆకులను ఇలా వాడారంటే షుగర్, బీపీకి బైబై చెప్పొచ్చు..
Guava Leaves
Follow us

|

Updated on: Jul 02, 2024 | 3:31 PM

జామ కాయలు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. జామ పండు తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. జామ కాయని పేదోడి యాపిల్ అని అంటారు. యాపిల్ తినలేని వారు జామ పండును తినవచ్చు. జామ కాయలు అందరికీ అందుబాటులో, తక్కువ ధరలోనే ఉంటాయి. కాబట్టి జామ పండ్లను ఎవరైనా తినవచ్చు. జామ పండు తినడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. యాపిల్‌లో ఉండే పోషకాలన్నీ జామ కాయలో లభిస్తాయి. షుగర్ ఉన్న వాళ్లు కూడా జామ పండును తినవచ్చు. కేవలం జామ పండే కాకుండా జామ చెట్టు ఆకులు కూడా ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయని.. దీర్ఘకాలిక వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి జామ ఆకుల్ని తీసుకుంటే ఎలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ కంట్రోల్:

జామ ఆకుల్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో ఉండే ఫినోలిక్ సమ్మేళనం, యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు జామ ఆకుల్ని నములుతూ ఉంటే చాలా మంచిది.

బీపీ అదుపులో ఉంటుంది:

జామ ఆకుల్ని తినడం వల్ల రక్త పోటు కూడా అదుపులో ఉంచవచ్చు. జామ పండులో ఉన్నట్టే.. ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో సహాయ పడతాయి. కాబట్టి బీపీ ఉన్నవారు జామ పండు తిన్నా, ఆకులు నమిలినా మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్ అవుతారు:

జామ ఆకుల్ని తినడం వల్ల అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. మల బద్ధకం సమస్యను కూడా తగ్గిస్తాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

జీర్ణ క్రియ ఆరోగ్యం:

జామ ఆకులు తినడం వల్ల జీర్ణ క్రియ కూడా బాగుంటుంది. పొట్ట ఆరోగ్యం, ప్రేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ ఆకుల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు సమస్యలు తలెత్తకుండా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వెంకీమామకి జోడిగా ఆ క్రేజీ హీరోయిన్ .. నయా టెక్నాలజీతో శంకర్..!
వెంకీమామకి జోడిగా ఆ క్రేజీ హీరోయిన్ .. నయా టెక్నాలజీతో శంకర్..!
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలను దొచ
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలను దొచ
అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ
అఫీషియల్.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి IMDB టాప్ రేటింగ్ మూవీ
క్రెడిట్ కార్డుల ఖాతాదారులకు అలెర్ట్.. అమల్లోకి నయా రూల్స్..!
క్రెడిట్ కార్డుల ఖాతాదారులకు అలెర్ట్.. అమల్లోకి నయా రూల్స్..!
కల్కి దుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..
కల్కి దుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..
తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారికి
తక్కువ ధరకే లైట్ వెయిట్ వీల్‌చైర్లు.. సౌకర్యాన్ని కోరుకునే వారికి
తెలంగాణ సీపీగెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ సీపీగెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్ర బోస్.. 36 లక్షలతో సొంతూరికి..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్ర బోస్.. 36 లక్షలతో సొంతూరికి..
ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది..
ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. తొలి సీఎన్‌జీ బైక్‌ వచ్చేస్తోంది..
అమ్మేదీ కూరగాయలు.. చేసేదీ మాత్రం అదే పని..!
అమ్మేదీ కూరగాయలు.. చేసేదీ మాత్రం అదే పని..!