Interesting Facts: చెమటలు ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. అసలు విషయం ఇదే!

మనుషులకు ఎవరికైనా చెమటలు పట్టడం అనేది సాధారణమైన విషయం. వేసవిలో అయితే మరింత ఎక్కువగా పడతాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఈ చెమటలు ఎక్కువగా పట్టకుండా ఉండటం కోసం ఏసీలు ఉపయోగిస్తున్నారు. కానీ చెమటలు ఎంత ఎక్కువ పడితే అంత మంచిదని అంటారు. అలాగే చెమటలు ఎక్కువగా పడితే బరువు కూడా తగ్గుతారని చెబుతారు. ఆ చెమటలు పట్టించడానికే జిమ్‌లో తెగ వర్క్ అవుట్స్ చేస్తూ..

Interesting Facts: చెమటలు ఎక్కువగా పడితే బరువు తగ్గుతారా.. అసలు విషయం ఇదే!
Interesting Facts
Follow us

|

Updated on: Jul 02, 2024 | 3:02 PM

మనుషులకు ఎవరికైనా చెమటలు పట్టడం అనేది సాధారణమైన విషయం. వేసవిలో అయితే మరింత ఎక్కువగా పడతాయి. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఈ చెమటలు ఎక్కువగా పట్టకుండా ఉండటం కోసం ఏసీలు ఉపయోగిస్తున్నారు. కానీ చెమటలు ఎంత ఎక్కువ పడితే అంత మంచిదని అంటారు. అలాగే చెమటలు ఎక్కువగా పడితే బరువు కూడా తగ్గుతారని చెబుతారు. ఆ చెమటలు పట్టించడానికే జిమ్‌లో తెగ వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటారు. అందుకే శరీరం నుంచి ఎంత చెమట పడితే అంత మంచిదని, త్వరగా బరువు తగ్గుతారని అందరూ బలంగా నమ్ముతారు. మరి ఈ విషయం నిజమేనా? ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి.

అసలు చెమట ఎందుకు పడుతుంది..

చెమట పట్టడానికి అసలు రీజన్.. ఉష్ణోగ్రత. శరీరంలో వేడి అనేది ఎక్కువగా పెరిగినప్పుడు శరీరంలోని చెమట గ్రంథులు యాక్టీవ్ అవుతాయి. వీటి వల్ల శరీరంలోని వేడిని బయటకు పంపించడానికి చెమట అనేది పడుతుంది. అందుకే ఎండా కాలంలో ఎక్కువగా చెమట పడుతుంది. అలాగే ఏదైనా శారీరక శ్రమ చేసేటప్పుడు కూడా చెమట పడుతుంది.

చెమటకి బరువు తగ్గడానికి సంబంధం ఏంటి..

చెమట ఎక్కువగా పట్టడం వల్ల వెయిట్ లాస్ అవుతారని చాలా మంది అనుకుంటారు. ఎంత చెమట ఎక్కువగా పడితే అంత వెయిట్ లాస్ అవుతామని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా తప్పు అని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి, చెమటకు అసలు ఎలాంటి సంబంధం లేదు. కేవలం శరీరంలోని కేలరీలను మాత్రమే బర్న్ చేస్తుంది. మీరు ఎలాంటి జిమ్ చేసినా.. వ్యాయామం చేసినా కేవలం కేలరీలు మాత్రమే ఖర్చు అవుతాయి. అంతే కానీ కొవ్వును కరిగించలేదు. కాబట్టి చెమట పట్టడానికి.. బరువు తగ్గడానికి మాత్రం ఎలాంటి సంబంధం లేదు.

ఇవి కూడా చదవండి

చెమట పట్టడం వల్ల ప్రయోజనాలు:

చెమట పట్టడం వల్ల శరీరానికి మాత్రం చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. శరీరంపై మురికి పోతుంది. చర్మం లోపల ఉన్న టాక్సిన్స్, వ్యర్థాలు అన్నీ చెమట రూపంలో బయటకు పోతాయి. దీని వల్ల చర్మం క్లీన్ అయ్యి.. మెరుస్తూ ఉంటుంది. చెమట పట్టడం వల్ల చర్మం pH స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..