Telangana Tourism: రూ. 1500ల్లో వీకెండ్ టూర్‌.. జోగులాంబతో పాటు..

సెలవులతో సంబంధం లేకుండా వారాంతాల్లో ప్లాన్‌ చేసుకునేలా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్‌ - బీచ్‌పల్లి - అలంపూర్‌ టెంపుల్స్‌ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ ప్యాకేజీ ప్రతీ శని, ఆదివారాల్లో అందుబాటులో ఉండనుంది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్‌ ముగుస్తుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు...

Telangana Tourism: రూ. 1500ల్లో వీకెండ్ టూర్‌.. జోగులాంబతో పాటు..
Telangana Tourism
Follow us

|

Updated on: Jul 02, 2024 | 2:51 PM

ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేయాలంటే సెలవులు పెట్టాలి. వారం ముందు నుంచే ప్రిపేర్‌ అవ్వాలి. ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేసుకోవాలి. ఇలా ఎన్నో ఆలోచనలు ఉండేవి. అయితే ఇలాంటి టెన్షన్స్‌ లేకుండా టూర్స్‌ ప్లాన్‌ చేసుకునేందుకు పలు సంస్థలు ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ టూరిజం ఒకటి. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ప్యాకేజీలను అందిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఓ బెస్ట్ టూరిజం ప్లాన్‌ గురించి ఇప్పుడు తెలుసుకుంది.

సెలవులతో సంబంధం లేకుండా వారాంతాల్లో ప్లాన్‌ చేసుకునేలా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్‌ – బీచ్‌పల్లి – అలంపూర్‌ టెంపుల్స్‌ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ ప్యాకేజీ ప్రతీ శని, ఆదివారాల్లో అందుబాటులో ఉండనుంది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్‌ ముగుస్తుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రయాణం ఇలా సాగుతుంది..

* ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయలుదేరుతుంది.

* ఉదయం 11.30 గంటలకు బీచ్‌పల్లికి చేరుకుంటారు. ఇక్కడ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. కృష్ణానది పక్కన ఈ ఆలయం ఉంటుంది. కృష్ణా నదిపై బ్రిడ్జ్‌ దాటడం మంచి అనుభూతిని ఇస్తుంది.

* అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు.

* ఈ మధ్యలోనే హరిత హోటల్‌లో లంచ్‌ ఉంటుంది. సాయంత్రం స్నాక్స్‌ హరిత హోటల్‌లోనే ఏర్పాటు చేస్తారు.

* ఇక సాయంత్రం 4.30 గంటలకు అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు..

ప్రతీ శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి నాన్‌ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది. టికెక్‌ ధరల విషయానికొస్తే పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 122గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..