Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘కల్కి’.. ఎక్కడ చూడొచ్చంటే?

ప్రభాస్ అభిమానులు గెట్ రెడీ.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'కల్కి'.. ఎక్కడ చూడొచ్చంటే?
Kalki 2898 AD Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2024 | 1:11 PM

ప్రభాస్ అభిమానులు గెట్ రెడీ.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, మాళవికా నాయర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు. జూన్ 27న థియేటర్లలో రిలీజైన కల్కి సినిమా ఓవరాల్ గా రూ.1200 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఆగస్టు 15 నాటికి ఈ సినిమా థియేటర్లలో రిలీజై 50 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికీ అక్కడక్కడ ప్రభాస్ సినిమా సందడి చేస్తోంది. మరోవైపు ఎప్పుడెప్పుడు కల్కి సినిమాను ఓటీటీలో చూద్దామా? అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీరి కోసమే మరికొన్ని గంటల్లో ప్రభాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కల్కి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే హిందీ వెర్షన్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి. ఆగస్టు 22 (గురువారం) నుంచి కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్న మాట.

కల్కి సినిమా తెలుగు వెర్షన్ తో పాటు తమిళం, కన్నడ, మలయాళ గతా భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్ మాత్రం కేవలం నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కు రానుంది. గతేడాది సలార్ తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. అలానే మారుతితో కలిసి ది రాజా సాబ్, నాగ్ అశ్విన్ తో కలిసి కల్కి 2, ప్రశాంత్ నీల్ తో సలార్ 2, సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో కల్కి తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్,..

హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!
బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి
కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి
'టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీ'.. బన్నీ అరెస్ట్‌పై శ్రీలల
'టెన్షన్ పడ్డా.. ఇప్పుడు హ్యాపీ'.. బన్నీ అరెస్ట్‌పై శ్రీలల
ఊరంతా టెన్షన్ పెట్టిన ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలుసా?
ఊరంతా టెన్షన్ పెట్టిన ముగ్గురు పిల్లలు.. ఎందుకో తెలుసా?
కరాచీలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. ఎందుకంటే
కరాచీలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. ఎందుకంటే
అద్భుతాలు చేసే పసుపుతో షుగర్ లెవల్స్‌ను ఇలా కంట్రోల్ చేయండి..
అద్భుతాలు చేసే పసుపుతో షుగర్ లెవల్స్‌ను ఇలా కంట్రోల్ చేయండి..
భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.!
భర్తకు నిద్రమత్తుతో డ్రైవింగ్ సీటులోకి భార్య.. ఇంతలోనే షాక్.!
అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్
అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్