Meghna Naidu : విక్రమార్కుడు మూవీ స్పెషల్ సాంగ్‌లో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది!

మాస్ మహరాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో విక్ర మార్కుడు ముందుంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనుష్కా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చిల్లర దొంగ అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ విక్రమ్ రాథోడ్ పాత్రలో రౌద్రం పండించాడు.

Meghna Naidu : విక్రమార్కుడు మూవీ స్పెషల్ సాంగ్‌లో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది!
Vikramarkudu Movie
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2024 | 1:54 PM

మాస్ మహరాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో విక్ర మార్కుడు ముందుంటుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనుష్కా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చిల్లర దొంగ అత్తిలి సత్తిబాబుగా కడుపుబ్బా నవ్విస్తూనే, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ విక్రమ్ రాథోడ్ పాత్రలో రౌద్రం పండించాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ టిట్లా పాత్రలో అజయ్ అదరగొట్టాడు. ఇక రాజమౌళి సినిమా అంటే స్సెషల్ సాంగ్స్ కు కూడా ఎంతో ప్రాధాన్యముంటుంది. అలా విక్రమార్కుడు సినిమాలో కూడా ‘ వస్తావా వస్తావా.. ఒక్కసారి వస్తావా’ అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఇందులో తన అందచందాలతో మైమరిపించి హుషారైన స్టెప్పులేసింది ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు మన తెలుగమ్మాయి మేఘనా నాయుడు. విజయ వాడలో పుట్టి పెరిగిన మేఘన ముంబైలో చదువుకుంది. 18 ఏళ్ల వయసులోనే ప్రేమ సాక్షి అనే తెలుగు సినిమాకు ఎంపికైంది. ఆ తర్వాత శ్రీహరి పృధ్వీ నారాయణ, వెండి మబ్బులు తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, బెంగాలీ, తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించిందీ ముద్దుగుమ్మ.

కాగా కొన్ని సినిమాల్లో బోల్డ్ గా నటించి హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మేఘనా నాయుడు. అందులో భాగంగానే విక్రమార్కుడులో స్పెషల్ సాంగ్ చేసింది. విక్టరీ వెంకటేశ్ నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే మూవీలో చెలి చెమకు కనులు వల వేసేనులే తొలిగా తొలిగా పాటలోనూ సందడి చేసింది. బాలకృష్ణ పాండు రంగడు, నాగ చైతన్య 100% లవ్, నాని పిల్ల జమీందార్ సినిమాల్లోనూ ప్రత్యేక గీతాల్లో నటించిందీ అందాల తార. అయితే గత కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించడం లేదు మేఘనా నాయుడు. అయితే అప్పుడప్పుడు హిందీ, కన్నడ, బెంగాలీ, మరాఠీ సినిమాల్లో కనిపిస్తుంటుంది. కాగా 2016 లో టెన్నిస్ ఆటగాడు లూయిస్ మిగ్యుల్ రీస్‌ ను ప్రేమ వివాహం చేసుకుంది మేఘన.

ఇవి కూడా చదవండి

మేఘనా నాయుడు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆమె తన ఫొటోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తుంటుంది. వీటిని చూసిన నెటిజన్లు ‘రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారు మేడమ్’? అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.