AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangalore Days OTT: ఓటీటీలోకి వచ్చేసిన రానా, సమంతల ‘బెంగళూరు డేస్’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రానా దగ్గుబాటి, సమంతలు నటించిన ఓ సూపర్ హిట్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు బెంగళూరు డేస్. సాధారణంగా ఈ పేరు వింటేనే దుల్కర్ సల్మాన్ సినిమానే గుర్తుకు వస్తుంది. 2014లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది

Bangalore Days OTT: ఓటీటీలోకి వచ్చేసిన రానా, సమంతల 'బెంగళూరు డేస్' తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bangalore Days Movie
Basha Shek
|

Updated on: Aug 21, 2024 | 9:48 AM

Share

ఈ వారం ఓటీటీ లో పలు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రానా దగ్గుబాటి, సమంతలు నటించిన ఓ సూపర్ హిట్ మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు బెంగళూరు డేస్. సాధారణంగా ఈ పేరు వింటేనే దుల్కర్ సల్మాన్ సినిమానే గుర్తుకు వస్తుంది. 2014లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో దుల్కర్ సల్మాన్ తో పాటు నజ్రియా, పార్వతి , నివిన్ పౌలి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఫ్రెండిషిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇదే సినిమాను 2016లో తమిళంలో ఇదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో ఆర్య, శ్రీవిద్య, రానా , సమంతలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అప్ప్పట్లో దీని తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారట. కానీ అది జరగలేదు.

మంచి ఫీల్ ఉన్న సినిమా..

ఇప్పుడీ బెంగళూరు డేస్ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఒరిజినల్ మలయాళం వెర్షన్ కావాలంటే మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సినిమా మొత్తం నలుగురు స్నేహితుల చుట్టే తిరుగుతుంది. స్నేహం, ప్రేమ, పెళ్లి, కెరీర్ కు సంబంధించి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఎక్కడ బోర్ కొట్టని ఈ సినిమా చూసే వారికి మంచి ఫీల్ ను ఇస్తుంది. మరి మీరు కూడా ఈ  బెంగళూరు డేస్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఇప్పుడు ఎంచక్కా తెలుగులో  చూసి ఎంజాయ్ చేయండి..

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్