AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raayan OTT: ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ‘రాయన్’ను ఎక్కడ చూడొచ్చంటే?

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాయన్ సినిమాను నిర్మించారు. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. దీనికి తోడు ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా కావడంతో బాగా బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Raayan OTT: ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. 'రాయన్'ను ఎక్కడ చూడొచ్చంటే?
Dhanush Raayan Movie
Basha Shek
|

Updated on: Aug 23, 2024 | 7:33 AM

Share

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం రాయన్. ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం. ప్రకాశ్ రాజ్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, అపర్ణ బాలమురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రాయన్ సినిమాను నిర్మించారు. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ తో రిలీజ్ కు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. దీనికి తోడు ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా కావడంతో బాగా బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 26న థియేటర్లలో విడుదలైన రాయన్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళంలో ఈ మూవీకి ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి. తెలుగులోనూ ధనుష్ సినిమా సుమారు 550 థియేటర్లలో రిలీజ్ కాగా, ఇక్కడ కూడా బాగానే కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన రాయన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ధనుష్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధ రాత్రి నుంచే రాయన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ,తమిళ్, మలయాళ భాషల్లో ధనుష్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

రాయన్ సినిమాలో ధనుష్ సోదరి దుర్గగా దుషారా విజయన్ నటన హైలెట్ గా నిలిచింది. కాళిదాస్ జయరామ్, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్, దిలీపన్, ఇళవరసు తదితరులు తమ పాత్రలతో మెప్పించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ అందించిన స్వరాలు, బీజీఎమ్ రాయన్ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. . ఇందులోని ఉసురు నీతానే సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, రీక్రియేషన్ వీడియోలే కనిపిస్తున్నాయి. మరి థియేటర్లలో ధనుష్ రాయన్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఆనందించండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!